ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విశాఖ జిల్లా మర్రిపాలెం ప్రాంతానికి చెందిన మొహినుద్దీన్ (46), సంషాషా(39), ఫాతిమా జెహ్ర(17) కొత్తవలస మండలంలోని చింతలపాలెం సమీపంలో ఉన్న బావిలో దూకి సోమవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో స్థానిక పోలీసులు బుధవారం మధ్యాహ్నం మర్రిపాలెంలోని ఎఫ్సీఐ కాలనీలో ఉన్న వారి నివాసంలో ఆధారాల కోసం గాలించారు. చుట్టుపక్కల వారితో మాట్లాడి పలు వివరాలు సేకరించారు. మరోవైపు ఘటనా స్థలంలో మూడు ఫోన్ నెంబర్లు రాసి ఉన్న కాగితం లభించింది. దీంతో కాల్ డేటాను రాబడుతున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, భార్యాభర్తలతోపాటు కుమారై కూడా మృతి చెందడం పై వేరే కారణాలు ఉండొచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే వారి మృతికి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈక్రమంలో పోస్టుమార్టం అనంతరం ముఖ్యమైన శరీర భాగాలను విశాఖలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు.ఈ విషయంలో స్పష్టంగా తెలియవలసిన విషయాలు చాలా ఉన్నాయి అంటూ పోలీసులు చెప్పుకొచ్చారు
[zombify_post]