పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం..
పెట్రో బంకుల్లో నిరంతరం దోపిడీ.
వాహనదారుల జేబులకు చిల్లు.
అధికారుల తనిఖీలు శూన్యం.
నేటికాలంలో సామాన్యుడి జీవితం చాలా దారుణంగా ఉంది. కారణం పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇంధన ధరలు. ఇవి మధ్యతరగతి కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు నింగివైపు పరుగులు తీస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.112పైనే ఉంది. ఇది చాలదన్నట్లు కొందరు పెట్రోల్ బంకుల యజమానులు అక్రమాలకు తెరలేపుతున్నారు. బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు నీళ్లు పోస్తున్నారు. ఇదేమి ప్రశ్నిస్తే అది అంతే అంటున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు పెట్రోల్‌లో కలుస్తున్న నీళ్లు వాహనాలను దెబ్బతీసి జేబులను గుల్ల చేస్తున్నాయి. బంకుల యాజమానులకు కాసుల ధ్యాస తప్ప నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలన్న ప్రయత్నం మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలుకే అధిక ధరతో సామాన్యుడు అల్లాడిపోతుంటే. అది చాలదన్నట్లు వీరి మోసాలు తోడయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని కోటమ్మ హెచ్‌పి పెట్రోల్ బంకులో డీజిల్ కి బదులు నీళ్లు వచ్చాయి. దానిని చూసిన వాహనదారులు షాక్ కు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.
పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్‌కు బదులు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని కోటమ్మ హెచ్‌పి పెట్రోల్ బంకులో
వినియోగదారులు గమనించారు. బాటిల్, బకెట్లో పట్టించి చూడగా బకెట్ల డీజిల్ కి బదులు నీళ్లు రావడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులకు ఫోన్ చేస్తూ ఆందోళన చేస్తున్నా కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు.
వివాదాల కేంద్రంగాఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని కోటమ్మ హెచ్‌పి పెట్రోల్ బంకులోగతంలోవినియోగదారులను మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో.వినియోగదారులను మోసం చేస్తూ నిర్వాహణ చేస్తున్న బంకును పూర్తి స్థాయిలో తెరవకుండా సీజ్ చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వేగంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బంకు యాజమాన్యం ద్వారా మోసపోయిన వినియోగదారులందరినీ కూడబెట్టుకొని ఆందోళన చేస్తామని అంటున్నారు.
ఇప్పటి వరకు సాంకేతిక సాయంతో తక్కువ పెట్రోల్ కొట్టి.మోసాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం చూశాము. తాజాగా మాత్రం అంతకుమించి అన్నట్లు ఓ ఘరానా మోసం బయట పడింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని కోటమ్మ హెచ్‌పి పెట్రోల్ బంకులో ఓ వాహనదారుడు డీజిల్ కొట్టించుకునేందుకు వెళ్లాడు. పెట్రోల్ బంక్ వద్ద పలువురు వాహనదారులు ఆందోళన చేపట్టారు. నీళ్లు కలిసిన డీజిల్ ను తమ కార్లకు కొట్టడంతో కొంత దూరం వెళ్ళాక కార్లు ఆగిపోయాయని వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.మెకానిక్ పరీక్షించి నీళ్లు కలిసిన డీజిల్ కొట్టడం వల్లనే కార్లు ఆగిపోయాయని తెలిపాడు.నిర్లక్ష్యంగా నీళ్లు కలిపిన డీజిల్ ను విక్రయిస్తూ వాహనాలకు కొడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు ఆందోళన చేపట్టారు.
బంకు యజమానిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కావాలంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోమని దురుసుగా సమాధానం చెబుతున్నారని వాపోయారు.తక్షణం బంకు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
-సత్తుపల్లికొరవడిన అధికారుల నిఘా..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని కోటమ్మ హెచ్‌పి పెట్రోల్ బంకులో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది.
సత్తుపల్లి పట్టణ
పరిధిలో మొత్తం వివిధ కంపెనీలకు చెందిన బంక్‌లు ఉన్నాయి. ఇందులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని కోటమ్మ హెచ్‌పి పెట్రోల్ బంకులో పెట్రోలు డీజిల్‌కు బదులు నీళ్లు కల్తీ అధికంగా ఉండడంతో అప్పుడప్పుడు వివిధ కారాణాలతో గోడవలు జరుగుతుంటాయి. అయినా అధికారులు పర్యవేక్షించడంలో విఫలం చెందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
-జరిమానాకు జంకని వైనం..
వాహనదారులకు కొలత తగ్గించి పెట్రోలు, డీజిల్ పోస్తే బంకు యజమానికి రూ.5వేలు అపరాధరుసుం విధించే అవకాశం ఉంది. పంపులకు సకాలంలో ముద్ర వేయించ పోయినా రూ. 5వేల అపరాధరుసుం చెల్లించాలి. ఈ అపరాధ రుసుములకు కూడా బంకుల యజమానులు జంకటం లేదు. నిర్వాహకులు పెట్రోలు, డీజిల్‌లో కల్తీలకు పాల్పడినా, కొలతల్లో తేడాలు ఉన్నా పరిశీలించి అక్రమాలు బయటపడితే బంకును సీజ్ చేయాల్సి ఉంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు.
[zombify_post]