- రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఏనుగుల కనుకయ్యను రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించి, నియామక పత్రం అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్. అలాగే తడగొండ గ్రామానికి చెందిన కట్ట లచ్చయ్యను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమించి, నియామక పత్రమును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అందజేశారు.
ఈ సందర్బంగా ఏనుగుల కనుకయ్య, కట్ట లచయ్యలు మాట్లాడుతూ మా నియామకానికి సహకరించిన మాజీ మంత్రి ఏమ్మెల్సీ జీవన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లకు, బోయినిపల్లి మండల నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ,రానున్న రోజుల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురవటానికి కృషి చేస్తామని,అలాగే చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపు కోసం మా వంతు గా కృషి చేస్తామని అన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో, బోయినిపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్, బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, తడగొండ ఎంపీటీసీ సభ్యులు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, ఎండీ బాబు, ముదం తిరుపతి, మండల శ్రీనివాస్, పొన్నం మధు, యువజన కాంగ్రెస్ నాయకులు నిమ్మ వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
