in ,

ప్రగతిభవన్లో ప్రింట్ మీడియా రిపోర్టర్లతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చిట్ చాట్

ktr

ప్రగతిభవన్లో ప్రింట్ మీడియా రిపోర్టర్లతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చిట్ చాట్
అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో brs పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉన్నది
90 స్థానాలకు పైగా గెలుస్తాం, కెసిఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు
పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారు
ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయి
కెసిఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష ప్రతిపక్షల తాపత్రయం రెండవ స్థానం కోసమే సిట్టింగ్లకు సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయి తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ గారు సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారు
కెసిఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు 65 సంవత్సరాల లో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కాలేజీలు ,కేవలం రెండు మెడికల్ కాలేజీలే కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు, నవోదయ పాఠశాల ఇవ్వలేదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదు
మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు, ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదు ఢిల్లీ నుంచి వచ్చి సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్
తమ పార్టీ నాయకులపైననే చెప్పులు విసిరి పార్టీ కాంగ్రెస్… ఢిల్లీ బానిస పార్టీలు జాతీయ పార్టీలు ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరు తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా, తెలంగాణ బిడ్డ కావాలా తెలుసుకోవాలి కేవీపీ రామచంద్రరావు, షర్మిలలు, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారు
తెలంగాణ ఈరోజు వారు కాంగ్రెస్ ని గెలిపిస్తారంట
తెలంగాణను వ్యతిరేకించిన కెవిపి, షర్మిలలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి తేస్తాం అంటున్నారు. ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది
తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి,  తెలంగాణ ప్రజల పైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి.. వీరు తెలంగాణ కోసం ముసుగులో వచ్చారు
తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి…కేవీపీ రామచందర్రావు… షర్మిల వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారు… బహురూపుల వేషాల్లోలో తెలంగాణ పైకి వస్తున్నారు. వీరందరితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
పదేళ్లు సాధించిన అభివృద్ధిని, తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడదామా ప్రజలు తెలుసుకోవాలి
పైకి కనబడేది కిషన్ రెడ్డి అదించేది  కిరణ్ కుమార్ రెడ్డి, కనబడేది రేవంత్ రెడ్డి ఆడించేది కేవీపీ రామచంద్రరావు తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన కేవీపీ రామచంద్రరావు ఈరోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం మా కర్మ రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరైన తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా… ఒక్కరన్న రాజీనామా చేశారు…కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయి అని తెలంగాణ ప్రజలు బెదిరించి, మెడలు వంచితే తెలంగాణ ఇచ్చింది సోనియా ఇచ్చింది అంటే అన్యాయంగా ఉంటుంది భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వారు అని బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే అంత దరిద్రంగా ఉంటుంది
నల్ల చట్టాలు తెచ్చిన బిజెపి కావాలా లేదా జీవితాన్ని వెలుగులు నింపిన భారత రాష్ట్ర సమితి సర్కారు కావాలా ఇంత భావ దారిద్య్రం, లేకితనం కలిగిన ప్రతిపక్షాలతో పోటీ పడాల్సి రావడమే ఈ రాష్ట్రం దురదృష్టం తెలంగాణకు మోడీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్ అడగదు బిజెపి అడగదు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎక్కడన్నా 4000 రూపాయల పెన్షన్ ఇస్తుందా చెప్పాలి
55 సంవత్సరాలలో 200 దాటి పెన్షన్ ఇవ్వని  వారు…. నాలుగు వేలు ఇష్టం అంటే ఎట్లా నమ్ముతారు
అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ వచ్చి  చెప్పిన, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పాత చరిత్ర తెలుసు
పాలమూరు ప్రాజెక్టు పైన కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన పార్టీలు ఈరోజు ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రశ్నిస్తున్నాయి 1963 లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ఎస్ఆర్ ఎస్పీ కాలువను నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించలేదా
మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలోని 13,14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఈ ప్రాజెక్టును స్వాగతించాలి
ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించే ధైర్యం లేని పార్టీలు ఈరోజు మాపైన ఎన్నికల్లో పోటీ అంటున్నాయి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రయత్నంలో భాగంగా one election one election జిమ్మిక్
ఉద్యమంలో భయపడి రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు కిషన్ రెడ్డి
ఇప్పుడు తెలంగాణ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితాఆని కలలు కంటే ఎవరు పట్టించుకుంటారు దేశంలో  మోడీని మా పార్టీ విమర్శించినంతగా ఏ ఇతర పార్టీ అయినా విమర్శ చేసిందా కాంగ్రెస్ పార్టీ బిజెపి అవగాహనలో ఉన్నాయి
అందుకే బిజెపిని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించరు…మా నాయకుల పైన దాడులు చేసిన ఈ డి దాడులు చేసినవి…ఒక్క కాంగ్రెస్ నాయకుడి పైన కూడా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేసినాయా
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల పైన మాట్లాడడానికి ఏం లేదు పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పైన మాకు ఏలాంటి సంబంధం లేదు అది వారి తలనొప్పి… మాకు సంబంధం లేదు…

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Bhanu

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

రసాభాసగా మారిన కాంగ్రెస్ పార్టీ సమావేశం.

ధర్మపురి నియోజకవర్గం నూతన నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పాటు