నూతన నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పాటు

– నియోజకవర్గం అధ్యక్షుడు ముత్యాల స్వామి
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం ఏడు మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు మంగళవారం నాడు నిర్వహించిన నూతన ధర్మపురి నియోజకవర్గం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పాటు చేయగా అధ్యక్షుడు ముత్యాల స్వామి, మరియు గౌరవ అధ్యక్షునిగా అమరవల్లి నారాయణ, కార్యవర్గ సభ్యులుగా పసుపునుటి అనిల్, పాల గణేష్, కనకయ్య రాచమల్ల మల్లేశం గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యాల స్వామి కార్యవర్గ సభ్యులు నాయి బ్రాహ్మణ కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల నాయీబ్రాహ్మణ సేవా సంఘం, ప్రధానకార్యదర్శి గంగిపెల్లి వేణుమాధవ్,వెల్గటూర్ మండల అధ్యక్షులు కంది తిరుపతి, ధర్మారం అధ్యక్షులు శ్రీనివాస్, ధర్మపురి అధ్యక్షులు కంది తిరుపతి, మందపెల్లి శ్రీనివాస్ గార్లు మరియు నాయీ కులబంధావుల పాల్గొన్నారు.
[zombify_post]