in ,

అవినీతి చంద్రబాబు రక్తంలోనే లేదు : నారా లోకేశ్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, నారా లోకేష్ విలేకరుల సమావేశం వివరాలు.అధికారంలోకి ఉన్నంతకాలం ప్రజలు, రాష్ట్రం, దేశం గురించి తప్ప మరొక ఆలోచని చేయని వ్యక్తి చంద్రబాబు. పరిశ్రమలు అభివృద్ధి, ఉద్యోగాలు, సంక్షేమం తప్ప అవినీతి చంద్రబాబు రక్తంలోనే లేదు.

దేశ రాజకీయాల్లోనే అరుదైన గుర్తింపు పొందారు. దేశంలోనే కాదు.ప్రపంచంలో అందరికీ తెలుసు.బిల్ గేట్, బిల్ క్లింటన్, ఫార్టూన్ కంపెనీల సీఈవోలను అడిగినా చంద్రబాబు గురించి చెప్తారు.అలాంటి వ్యక్తిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపింది సైకో జగన్ ప్రభుత్వం. అందుకే ఎప్పుడూ లేని విధంగా ప్రజల్లో భారీ స్పందన వచ్చింది. టీడీపీ ఇచ్చిన బంద్ కు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించారు.స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చారు. బంద్ ను విజయవంతం చేసిన ప్రజలు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అన్నలాంటి పవన్ కళ్యాణ్ , సీపీఐ రామకృష్ణ, మందకృష్ణమాదిగకు ధన్యవాదాలు చెప్తున్నా.సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు జోలికి రావడం. దీనికి రాజకీయంగా, వ్యక్తిగతంగా వారు చాలా మూల్యం చెల్లించుకుంటారు.జగన్ అధికారం అంటే తెలియదు. అధికారం అంటే యువతకు ఉద్యోగాలు కల్పించాలి..పరిశ్రమలు తీసుకురావాలి. కానీ జగన్ దృష్టిలో మాత్రం మాత్రం అధికారం అంటే కక్ష సాధింపులు, దొంగ కేసులు, హింసించడం, దాడులు చేయడం.పాముకు తలలో మాత్రమే విషముంటుంది. సైకో జగన్ కు ఒళ్లంతా విషముంది. 

చంద్రబాబుపై అవినీతి మరక వేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.ఇది ఎవరూ నమ్మడం లేదు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా కూడా, జోహో సిఇఓ శ్రీధర్ అరెస్టును ఖండించారు.పింక్ డైమండ్, బాబాయ్ హత్యకేసు, కోడి కత్తికేసులో చంద్రబాబు ప్రమేయంపై ఎంత నిజముందో ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కూడా అంతే నిజం ఉంది.అధికార బలంతో చంద్రబాబును అరెస్టు చేశారు తప్ప ఆధారాలతో చేయలేదు. చంద్రబాబు అకౌంట్లోకిగానీ, బంధువుల అకౌంట్లోకి గానీ డబ్బులు వచ్చినట్లు నిరూపించలేదు.జగన్ చరిత్ర ఏంటి, ఆయనపై ఎన్ని కేసులున్నాయి.ప్రజలకు సమాధానం చెప్పగలరా? మొత్తం 32 కేసులున్నాయి. 10 సీబీఐ, 7 ఈడీ కేసులు, 21 ఇతర కేసులు ఉన్నాయి. అయిదేళ్లుగా అవి ట్రయల్ కు కూడా రావడం లేదు. దీంతో వ్యవస్థలను ఎంత మ్యానేజ్ చేస్తున్నారో తెలుస్తోంది.

బాబాయ్ హత్య కేసులో నిందితులను జగన్ కాపాడుతున్నాడు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ వస్తే కర్నూలులో లా అండ్ ఆర్డర్ సంమస్య వస్తుందని పోలీసులను అడ్డంగా పెట్టుకుని అరెస్టు కాకుండా చూసుకున్నాడు.ఛార్జ్ షీట్ లో దోషిగా ఉన్న వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్ గా చేశారు. జగన్ కు ఉన్న మరక అందరికీ అంటించాలని చూస్తున్నాడు. స్కిల్ డెవెలెప్మెంట్ కేసులో చంద్రబాబుపై అవినీతి ముద్రపడలేదు. కానీ జగన్ సైకో ఇజం ఎంత పీక్ స్టేజ్ లో ఉందో అర్థమైంది.స్కిల్ డెవలెప్మెంట్ కేసు ఫేక్ కేసు. ఇందులో చంద్రబాబు సంతకంకానీ, చంద్రబాబుకు డబ్బులు రావడం వచ్చాయని రిమాండ్ రిపోర్టులో కూడా చూపించలేకపోయింది. 2013లో గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నాడు. ఇదే ప్రాజెక్టును గుజరాత్ లో అమలు చేశారు. ఇదే కంపెనీ సీఈఓలు ప్రాజెక్టు పనుల్లో సంతకాలు చేశారు. గుజరాత్ పాటు 7 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. 

ఈ ప్రాజెక్టు ద్వారా నిరుద్యోగులకు స్కిల్స్ అప్ గ్రేడ్ చేసి ఉద్యోగాలు వచ్చేలా చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.42 సెంటర్లు ద్వారా 2.13 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి లక్ష మందిదాకా ఉద్యోగాలు వచ్చేలా చేశాం.స్కిల్ డెవలెప్మెంట్ ను స్టడీ చేసింది ప్రేమ్ చంద్రారెడ్డి. ఆనాడు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది అజేయ్ కల్లం రెడ్డి. వారిద్దరూ ఈ ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు..కానీ వారిపై కేసు పెట్టలేదు.ఈ ప్రాజెక్టుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్స్ కూడా సర్టిఫికేట్ ఇచ్చింది. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, మెటీరియల్ అందిండంతో పాటు ప్రాజెక్టు సజావుగా నడుస్తోందని స్కిల్ డెవలెప్మెంట్ ఎండీ సర్టిఫికేషన్ ఇచ్చారు.2021 డిసెంబర్ లో కేసు నమోదు చేశారు. 36 మంది ఆరోపణలు ఎదుర్కొనే వారుంటే 30 మందిని అరెస్టు చేసింది ఈ ప్రభుత్వం.

• 4 ఏజన్సీల ద్వారా విచారణ చేసినా ఒక్క ఛార్జ్ షీట్ కూడా రెండేళ్లుగా ఫైల్ చేయలేకపోయింది. దీనర్థం తప్పు జరగలేదు. ఈడీ రిపోర్ట్ లో కూడా మనీ లాండరింగ్ జరగలేదని స్పష్టంగా తేల్చి చెప్పింది.నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా చంద్రబాబుకు డబ్బులు ఎలా వచ్చాయో ఇప్పుడైనా నిరూపించగలుగుతారా? స్టేట్ మెంట్లు కాదు.ఆధారాలతో పలానా అకౌంట్, పలానా షెల్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారని నిరూపించగలగుతారా?

•ఏపీ పరిస్థితి చూస్తే బాధేస్తోంది. పరిశ్రమలు తెచ్చి, ఉద్యోగాలు కల్పిస్తే కేట్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు..కానీ ప్రతి పక్షనేతపై కేసులు పట్టి అరెస్టు చేస్తే సంబరాలు చేసుకుంటున్నారంటే ఎంత కక్షతో ఉన్నారో తెలుస్తోంది.సీఐడీ కక్షసాధింపు డిపార్ట్ మెంట్ గా మారింది. ప్రజలందరూ ఆలోచించాలి. ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి అప్పారావును కూడా రాజమండ్రి జైలుకు పంపింది. చినరాజప్పపైనా అట్రాసిటీ కేసు పెట్టింది. నాపై ఇప్పటికీ 20 కేసులు పెట్టింది. ప్రజల తరపును మేము పోరాడుతున్నాం..ఏ తప్పూ చేయలేదు.ఎన్నిసార్లు జైలుకు పంపుతారో పంపుకోండి మేము సిద్ధంగా ఉన్నాం పోరాటం ఆగదు.

రూ.42 వేల కోట్లు కొట్టేసి బయట తిరుగుతున్నారు. సొంత బాబాయ్ ని చంపిన అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్నారు.మేము ఏ తప్పూ చేయలేదు..వేధించి కేసులు పెడతామంటే ఊరుకోం. చంద్రబబును అరెస్టు చేసి చాలా తప్పు చేశారు..ఎవర్నీ వదిలిపెట్టను..ప్రజల్లోకి వెళ్తా సమస్యలు తెలుకుంటా..న్యాయం నిలబడే వరకూ పోరాడతా.చంద్రబాబును అరెస్టు చేస్తారని మంత్రులు ముందే చెప్పారు. ఇప్పుడు నన్ను కూడా అరెస్టు చేస్తామని ముందే చెప్తున్నారు. ట్రైలర్ చూపిస్తాం..సినిమా చూపిస్తాం అంటున్నారు. 

•నేనెక్కడికీ పారిపోలేదు.రాజమండ్రిలోనే ఉన్నా. ప్రజల కోసం పోరాడతా..న్యాయం గెలిచే వరకూ ఎవర్నీ వదిలిపెట్టను. దొంగ కేసులకు భయపడం. పెద్ద తప్పు చేశారు.మంత్రి బొత్స వల్ల ఓక్స్ వ్యాగన్ రాష్ట్రం నుండి పోయింది..ఎందుకు పోయిందో సమాధానం చెప్పాలి. జగన్ ను సీబీఐ తప్పు చేసినట్లు,రూ.42 వేల కోట్లు దోచుకున్నట్లు నిరూపించింది. 

•చంద్రబాబు ఈ ప్రభుత్వంపై పోరాడుతున్నారు..నీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపై పోరాడుతున్నారు. భవిష్యత్తకు గ్యారంటీ ద్వారా ప్రజల్లోకి వెళ్లారు..ఈ ప్రభుత్వాన్ని కడిగేశారు.స్కిల్ కేసులో హడావుడిగా కేసులు పెట్టారు..2021లో ఎఫ్ఐఆర్ కట్టారు..రెండేళ్ల తర్వాత 36 మంది తర్వాత 37వ వ్యక్తిగా చంద్రబాబును చేర్చారు.ఈ కేసులో కేంద్రం ఉన్నదో..లేదో మాకు తెలియదు. బీజేపీ వాళ్లనే అడగండి.మేము 7 ఏళ్లుగా మా ఆస్తులు ప్రకటిస్తున్నాం.గజం ఎక్కువగా చెప్తే మా ఆస్తులు రాసిస్తామని చెప్పారు. రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుకు డబ్బులు ఎలా వచ్చాయన్నదానిపై ఇప్పటికీ నిరూపించలేదు. ఒక్క షేర్ ఎక్కువున్నా అప్పగిస్తాం.కక్ష సాధింపుతోనే దొంగ ఎఫ్ఐఆర్ తో జైలుకు పంపుతున్నారు. స్కామ్ ఉంటే 2 ఏళ్లుగా ఎందుకు చంద్రబాబును ఎందుకు విచారణకు పిలవలేదు.?అధికారంలోకి వచ్చాక పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఎక్కడుందో చూపించారా.? అమరావతిలో గజం భూమిమైనా కొన్నామని నిరూపించారా.? ఇవి తప్పుడు ఆరోపణలు కాదా.?

•టీడీపీ పోరాటం చేస్తోంది..దీన్ని ఆపాలని దొంగ కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నారు..మా పోరాటం ఆగదు.టీడీపీకి సంక్షోభాలు కొత్తకాదు. ఇందిరా గాంధీ, రాజశేఖర్ రెడ్డితో టీడీపీ పోరాడింది. సైకో జగన్ ఒక లెక్కకాదు. చంద్రబాబును దొంగ కేసులతో జైలుకు పంపితే టీడీపీ, టీడీపీ సైన్యం ఆగిందా ఆగదు చంద్రబాబును అరెస్టు చేయడం మాకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే. నేను అన్నగా బావించే పవన్ అండగా నిలబడ్డారు. మమతా బెనర్జీ నిలబడ్డారు. జోహో సీఈవో కూడా బాధతో ట్విట్టర్లో పోస్టు చేశారు. లక్షలాది కార్యకర్తలు, నేతలు అండగా ఉంటే మేము ఒంటరివాళ్లం ఎలా అవుతాం?

•ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి షాపులు మూసి నిరసన తెలిపారు..స్కూళ్లు మూసేశారు..నేను నేను ఒంటరివాన్ని అవుతా.?ఏ ప్రభుత్వంలోనైనా గ్రీన్ నోట్ ఫైనల్..అసలు ఇది కార్పొరేషన్. ఈ ఫైల్ సీఎంకే కాదు..ఫైల్ మంత్రికే రాదు..సీఎం వద్దకు ఎలా వస్తుంది.మినిట్స్ నోట్ మాత్రమే మంత్రి వద్దకు వస్తుంది. గ్రీన్ నోట్, ఎంఓయూలో చంద్రబాబు సంతకం లేదు. ఏ కాగితంపైనా చంద్రబాబు సంతకం లేదు. ఆనాడు ఎండీ, ఫైనాన్స్ సెక్రటరిగా ఉన్నవారు ఇప్పుడు సీఎం వద్ద సలహాదారుగా ఉన్నారు..కానీ వారిపై కేసులు లేవు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకోను రాష్ట్రరం నుండి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా విమర్శలు, దొంగ కేసులు పెడతారు. వారి కుటుంబాల వారి ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు..బజార్లో పెడతారు. సొంత ఎంపీని కొట్టిన వారు వీళ్లు..దానికి సమాధానం చెప్పాలి..సొంత చెల్లి, తల్లిని బయటకు పంపారు దీనికి సమాధానం చెప్పాలి.టీడీపీ ఒకసారి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే ఎవరొచ్చినా తొక్కుకుని వెళ్తాం.

•లీగల్ అంశాలు సమన్వయం చేస్తున్నందున యువగళం పాదయాత్ర ప్రస్తుతం తాత్కాలికంగా విరామం ఇచ్చా. చంద్రబాబుపై దాడి జరుగుతోంది..దాన్ని ఆపాల్సిన బాధ్యత నాపై ఉంది. మా పార్టీ నేతలతో సమావేశమై మళ్లీ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్తా.నేను సీఎంను బూతులు తిట్టానని చంద్రబాబును జైల్లో పెట్టారా.? సైకో, హాలిడే అనే పదాలు బూతు పదాలు కాదు. బ్రోకర్ సజ్జల బూతు పదం కాదు..సజ్జల అనే పదం బూతుపదమైతే మార్చుకోవాలి. నేను ఈ మాటలన్నందుకు చంద్రబాబును అరెస్టు చేశారా.? 

•గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాలర్ పట్టుకోవాలి, నడిరోడ్డుపై కాల్చండి, చీపురుతో కొట్టండని జగన్ అన్నారు..కానీ నేను అనలేదు.

•తాము అవినీతిపరులని వైసీపీ వాళ్లకే అర్థమైంది. చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయాలని బురజ చల్లుతూ జైలుకు పంపారు. గేటు దాటిన తర్వాత చంద్రబాబు సీఐడీ ఆఫీసులోని ఫోటోలు బయటకు వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకుని కించపరుస్తున్నారు..కానీ వాటికీ మేము వాటికి భయపడం.జగన్ పై 38 కేసులున్నాయి. కోడికత్తి, బాబాయ్ హత్య కేసు ఆగిపోయాయి..దానిపై ఎందుకు మాట్లాడటం లేదు..దీన్ని బట్టి అర్థంకావడం లేదా..వ్యవస్థలను ఎవరు మ్యానేజ్ చేస్తున్నారు.? దొంగ కేసులు వాళ్లే పెట్టి మ్యానేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు.చంద్రబాబుకు ప్రజలు అండగా ఉండి సానుభూతి తెలుపుతున్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. దేశంలోని ప్రజలూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

•బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మేం పిటిషన్ వేశాం. అందులో స్పష్టంగా హౌస్ అరెస్ట్ ఇవ్వాలని అన్నాం. దానికి కారణం నక్సలైట్లు, మాజీ నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, గంజాయి స్మగ్లర్లు, ఎర్రచందనం స్మగర్లు సెంట్రల్ జైల్లో ఉన్నారు. దాని వల్ల చంద్రబాబు ప్రాణానికి హాని ఉంది..అందుకే హౌస్ అరెస్టు కోరాం. తీర్పు వచ్చాక కార్యాచరణ ప్రారంభిస్తాం. 

•రాష్ట్రంలో రేపు టీడీపీ పార్లమెంట్ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తాం..ఎల్లుండి అన్ని నియోజకవర్గాల్లో ఏం చేయాలన్న దానిపై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం. ప్రజల్లో చైతన్యం, మా నేతపై జరుగుతున్నదాడిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేపు చర్చించి ఎల్లుండి చేపడతాం.ములాఖత్ కు ఎంత మందికి అనుమతిస్తారో చూసి అమ్మ, బ్రాహ్మణితో కలసి చంద్రబాబును కలుస్తాం. చంద్రబాబు అరెస్టుతో షాక్ అయ్యాం..నిజాయితీకి ఆయన మారుపేరు. ఆయన తప్పులు చేసి కోర్టుకు వెళ్లాలనుకునే వ్యక్తి కాదు.ఏం తప్పూ చేయలేదు..అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకోసం 20 గంటలు పని చేశారు. నేను 8వ తరగతి చదివిన తర్వాత నేను మా నాన్నను నేరుగా చూశా..అంతక ముందు పేపర్లు, టీవీలోనే చూసేవాన్ని. అలాంటి వ్యక్తిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపితే బాధ, ఆవేదన ఉండదా…? 

•మా వాదనలు స్పష్టంగా జడ్జి ముందు పెట్టాం..అయినా ఏ కారణాల వల్లో తెలియదు మా నాయకుడికి రిమాండ్ విధించారు. రిమాండ్ రిపోర్ట్ అందరూ దయచేసి చదవండి..డబ్బులు ఎలా వచ్చాయో ఆధారాలు చూపించలేకపోయారు. 

•మేము పోరాడతాం..మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. 3 రోజులుగా నేతలు, కార్యకర్తలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. కార్యకర్తలు, నేతలపై ఈ ప్రభుత్వం పోలీసులును వినియోగిస్తోంది.

•పోలీసులను పక్కనబెట్టి వైసీపీ నేరుగా రావాలి. కొంతమంది ఉన్నతాధికారుల తప్పుడు నిర్ణయిలతో పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. పోలీసులు కూడా ఆలోచించాలి..ఒక్క ఆధారం కూడా లేని వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. దీనిపై శాంతియుతంగా టీడీపీ నిరసన తెలిపింది..రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ ఒక్క గొడవ చేయలేదు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దాడులు చేస్తున్నారు..దీక్షలు చేస్తుంటే పోలీసులను పెట్టుకుని శిభిరాలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు.

•పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలిస్తే డ్యాన్సులు వేసి, టపాసులు కాల్చాలి..కానీ ప్రతిపక్ష నేతపై కక్షతో కేసులు పెట్టి అరెస్టు చేస్తే ఎందుకు టపాసులు కాల్చుతున్నారో ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలి. 

•న్యాయపోరాటం జరుగుతోంది..వచ్చే జడ్జిమెంట్ తర్వాత పాదయాత్ర ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయిస్తాం.14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుపైనే దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారంటే ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచించండి. స్కిల్ డెవలెప్మెంట్, అమరావతి, ఫైబర్ గ్రిడ్ ఫైళ్లు నా వద్దకు రాలేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు 1500 ఫైళ్లు క్లియర్ చేశా..తప్పున్నట్లు ఒక్కటి కూడా నిరూపించలేదు. 

•నేను 2,900 కి.మీ పాదయాత్ర చేశా..అందుకే ప్రభుత్వం భయపడి కేసులు పెట్టింది.

•ప్రజల కోసం పోరాడుతున్నాం..ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి..బయటకు వస్తే మమ్మల్ని ప్రజలే భుజస్కాందాలపై పెట్టుకుని నడిపిస్తారు.

•చంద్రబాబు నాతో చివరి మాటగా ప్రజల సమస్యలపై నీ పోరాటం ఆపొద్దని అన్నారు. 

•నిన్న చంద్రబాబు పెళ్లిరోజు..ఆ రోజే కోర్టుకు తీసుకెళ్లారు..అదే రోజు రిమాండ్ కు పంపారు..కుటుంబ సభ్యులతో 5 నిమిషాలు కూడా మాట్లాడనివ్వలేదు.ఎన్ఎస్జీ కమాండర్ల రక్షణలో ఉన్న వ్యక్తి చంద్రబాబు.హెలికాప్టర్ లో అయితే టీం మొత్తం ఆయనతో వెళ్లలేదని ఎన్ఎస్జీ కమాండర్ అన్నారు.అందుకే రోడ్డుమార్గం గుండా చంద్రబాబు విజయవాడ వచ్చారు అని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Kiran

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views
Popular Posts

నారా లోకేష్ కు సీపీఐ రామకృష్ణ పరామర్శ

అద్భుతంగా సాగిన”శరణం గచ్ఛామి”కళా రూపం