మిషన్ ఇంద్ర టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
మిషన్ ఇంద్ర ధనుష్ టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు అన్నారు. ఈ సోమవారం నుండి శనివారం వరకు మన్యం జిల్లా వ్యాప్తంగా జరగబోయే మిషన్ ఇంద్ర ధనుష్ రెండో దశ టీకా కార్యక్రమానికి సంబందించిన ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఐదేళ్ళ లోపు పిల్లలు, గర్భిణీ లకు వ్యాధి నిరోధక టీకాలు వైద్య సిబ్బంది వేయడం జరుగుతుందన్నారు. I
[zombify_post]