డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా రావులపాలెం పార్టీ కార్యక్రమం వద్ద కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు ఆద్వర్యంలో సామూహిక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉదయం హౌస్ అరెస్టులో వున్న సత్యానందరావు పోలీసుల వలయాన్ని చేదించుకుని బైక్ పై రావులపాలెం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులతో కలసి సామూహిక సత్యాగ్రహదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ సాక్ష్యాలు లేకుండా చంద్రబాబు నాయుడిపై 409 సెక్షన్ పెట్టడం చట్టవిరుద్ధమని కేవలం రాజకీయ కక్షతోనే జగన్ ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి తీసుకోవలసిన నిభందనలు పాటించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ఆరోపించారు. నిజాయితీకి నిదర్శనమైన చంద్రబాబునాయుడుపై అవినీతి మరకలు వేయాలని చూశారని చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మండల నాయకుల చేతుల మీదిగా నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు చేశారు. ఈరోజు అధినాయకులు చంద్రబాబు నాయుడు, భువనేశ్వర్ల పెళ్లిరోజు కావడంతో శుభాకాంక్షలు తెలియజేశారు
[zombify_post]
