సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపెల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన 10 మంది బిజెపి కార్యకర్తలు బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి, సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ లు కన్నం మధు,ఒంటెల గోపాల్ రెడ్డి,ఉప సర్పంచ్ మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు సంబ లక్ష్మి రాజం ,సంధి సంపత్ కుమార్ ,ఎడపల్లి బాబు లు ఉన్నారు.

[zombify_post]