స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు వెళ్లనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ పోలీసులు షాకిచ్చారు.
ఇవాళ స్పెషల్ ఫ్లైట్‌లో విజయవాడ వెళ్లేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. బేగంపేట్ ఎయిర్ పోర్టులో స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్‌కు రెడీగా ఉంది. ఈ క్రమంలో ఏపీ పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులకు లేఖ రాశారు. పవన్ కల్యాణ్ విజయవాడకు వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుందని.. దీంతో పవన్ స్పెషల్ ఫ్లైట్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ అధికారులకు పోలీసులు లేఖ రాశారు.
పోలీసుల లేఖను పరిగణలోకి తీసుకున్న గన్నవరం ఎయిర్ పోర్టు అధికారులు పవన్ స్పెషల్ ఫ్లైట్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్ పోర్టులో పవన్ ప్రయాణించాల్సిన స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న పవన్ కల్యాణ్ స్పెషల్ ఫ్లైట్ ఇక్కడే నిలిచిపోయింది. విమానం నిలిపివేయడంతో బేగంపేట్ ఎయిర్ పోర్టు నుండి పవన్ కల్యాణ్ వెనుదిరిగారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ విజయవాడ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఇక, పవన్ కల్యాణ్ విజయవాడ రాకుండా అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.

[zombify_post]