డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థి సంగ్రమ యాత్ర 5వ రోజు ముగింపు యాత్ర కొత్తపేట మండలంలో జరిగింది యాత్రలో భాగంగా అనేక సమస్యలు వెలుగు చూసాయి ఈ సందర్భంగా కొత్తపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జరిగిన ముగింపు సభలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కోనసీమ జిల్లా కన్వీనర్ గుంజ మదన్ మాట్లాడుతూ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అమ్మాయిలకు టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు జిల్లా కో కన్వీనర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ మధ్యాహ్నం భోజన పథకంలో భోజనం నాణ్యత పెంచాలని కోరారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఎన్ రాజా మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు
[zombify_post]