in ,

ఎమ్మెల్యే రామానాయుడు కు అస్వస్థత

పాలకొల్లు (పశ్చిమగోదావరి) : పాలకొల్లు: టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అస్వస్థతకు గురయ్యారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో.. పాలకొల్లులోని ఎమ్మెల్యే నిమ్మల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటివద్దకు పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో టిడిపి శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో నిమ్మల కిందపడి అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, నిమ్మల అనుచరులు ఆరోపిస్తున్నారు. దీంతో రామానాయుడికి ఏం జరిగినా పోలీసులదే బాధ్యతంటూ నినాదాలు చేశారు.

[zombify_post]

Report

What do you think?

కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఒక సీటును మాదిగలకు కేటాయించాలి

ప్రజా వేదిక”*