బాడంగి మండలం రావివలస గ్రామంలో శుక్రవారం రాత్రి కొల్లి ఎరుకునాయుడుకు చెందిన ఎద్దును పులి దాడి చేసి చంపేసింది. కొన్ని నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన రెండు ఆవులను, అల్లుపాల్తేరుకు చెందిన ఒక ఆవును పులి దాడి చంపేసిన విషయం తెలిసిందే. పులి మళ్లీ సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి పులి ముప్పు ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. పోలీసులు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇన్ఫోర్మ్ చేయడం జరిగింది .పులిని త్వరగా పట్టుకుంటాం …
[zombify_post]