అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జొగంపేట మెయిన్ రోడ్డుపై సర్పంచ్ సుర్ల సీతారామమూర్తి(బాబ్జి) ఆధ్వర్యంలో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెదేపా నాయకులు మానవహారం నిర్వహించారు.అనంతరం అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని,వెంటవే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అలాగే పార్టీ మండల అధ్యక్షుడు ఆడిగర్ల అప్పలనాయుడు మరియు మరికొంత మంది ముఖ్యనాయకులను ముందస్తుగా గొలుగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈకార్యక్రమంలో పార్టీ శ్రేణులు గెడ్డం ఆనంద్, పలు గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]