తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి పోలీసులు ఈరోజు ఉదయం నంద్యాలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ మందస మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హరిపురం గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. మందస పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మందస మండల తెలుగుదేశం పార్టీ నాయకులు భావన.దుర్యోధన,రట్టి.లింగరాజు, లబ్బ.రుద్రయ్యల ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు మందస పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదించారు.
[zombify_post]