డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
నంద్యాల పర్యటనలో ఉన్న తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ని అరెస్ట్ చేసి నా అనంతరం శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జీ బండారు సత్యానందరావు ని వాడపాలెం లో ఆయన స్వగృహం నందు కొత్తపేట S.I. తమ బలగాలతో వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. ఏకార్యక్రమానికి వెళ్ళకుండా గృహ నిర్భంధం చేశారు.ఈసందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులను అక్రమంగా అరెస్టు చేయడం జగన్మోహన్ రెడ్డి పిరికిపంద చర్యని అన్నారు.
[zombify_post]