in ,

నంద్యాలకు విచ్చేసిన టిడిపి అధినేత చంద్రబాబు – భారీ గజమాలతో స్వాగతం పలికిన టిడిపి నాయకులు

బాబు ష్యురిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి 6 గంటలకు నంద్యాలకు చేరుకున్నారు. నంద్యాల బైపాస్ టర్నింగ్ వద్ద టిడిపి నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో నంద్యాల టిడిపి ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, మాజీ మంత్రి ఫరూఖ్, మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి,  మాజీ విత్తనాభివృద్ధి చైర్మన్ ఎవి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు, నంద్యాల నియోజకవర్గ  టీడీపీ పరిశీలకులు పోతురాజు రవికుమార్, నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్  తదితర నాయకులు పాల్గొన్నారు. భారీ ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట కదిలారు. ర్యాలీ ఆర్ కె ఫంక్షన్ హాల్ మీదుగా చామకాల్వ, మునిసిపల్ కార్యాలయం, సంజివనగర్, ఆర్ కె కలర్ లాబ్, శ్రీనివాస సెంటర్ ల మీదుగా ఖలీల్ టాకీస్ నుండి సభాస్థలి రాజ్ టాకీస్ సర్కిల్ కు చేరుకుంది. వేలాది మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు వెంట కదిలారు. దారి పొడవునా పూల మాలలతో, పచ్చటి బెలూన్లతో బాబుకు ఘన స్వాగతం పలికారు. కిలోమీటరు ర్యాలీ దాదాపు గంటన్నర పాటు  సాగింది. అనంతరం సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి తెలియజేయడం జరిగింది …. ఈ కార్యక్రమంలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Allagadda CM news

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా

సోషల్ మీడియాలో ఇతరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ లు చేస్తే కఠిన చర్యలు.*