సారంగాపూర్ మండలం న్యూస్ :- సారంగాపూర్ మండలం స్వర్ణ జలాశయంలోకి ఎగువ నుండి వరద నీరు వచ్చి చేరుతుంది. స్వర్ణ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులకు కాగా ప్రస్తుతం 1183 అడుగులకు చేరుకుంది. ఎగువ నుండి ఇన్ ఫ్లో వెయ్యి క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు గురువారం రాత్రి ఒక్క గేటు ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు. స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు, వారి పశువులను ఆ సామీపనికి వెలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
[zombify_post]