in ,

డొల్ల కంపెనీలో రూ. 118 కోట్లు దోచుకున్న చంద్రబాబు

 పాడేరు నియోజకవర్గం , అల్లూరి సీతారామరాజు జిల్లా: డొల్ల కంపెనీల పేరుతో రూ.118 కోట్లు దోచుకొని దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు,  లోకేష్ అండ్ బ్యాచ్ ఎందుకు మౌనం వహిస్తుందని పాడేరు శాసనసభ్యులు  కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు నిలదీశారు. డొల్ల కంపెనీల పేరుతో ఐటీ శాఖలో  రూ.118 కోట్లు చంద్రబాబు హయాంలో దోచుకున్నట్లుగా జాతీయ పత్రిక హిందుస్థాన్ టైమ్స్ లో కథనం వచ్చిన నేపథ్యంలో భాగ్యలక్ష్మి శుక్రవారం జీకే వీధిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రధాన అనుచరుడైన వాసుదేవున్ ఇంట్లో ఐటి డిపార్ట్మెంట్ దాడులు జరిపిన నేపథ్యంలో బయటపడ్డ రూ.118 కోట్ల కుంభకోణం విషయంలో ప్రతిపక్షాలు ఏవి ఎందుకు స్పందించడం లేదని ఆమె నిలదీశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్ ,  చంద్రబాబు మిగిలిన బ్యాచ్ మొత్తం అవాకలు చవాకలు పేలుతాయి గాని చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి గురించి ఎందుకు మాట్లాడటం లేదో తెలపాలన్నారు.  2014 విభజన చట్టంలో ఉన్నా పదేళ్లపాటు హైదరాబాద్ మనకు ఉమ్మడి రాజధానిగా ఉన్నా సరే చంద్రబాబు చేసినటువంటి ఓటుకు నోటు కేసు కు భయపడి విజయవాడకు పరిగెత్తుకొచ్చారన్నారు. విజయవాడలో అమరావతి పేరుతో కొత్త రాజధాని కడతానని తాత్కాలిక భవనాల నిర్మించి చేతులు దులుపుకున్నారని తెలిపారు. ఈ కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా చేసినటువంటి అభివృద్ధి కానీ ఆ ప్రాంతంలో డొల్ల కంపెనీలు సృష్టించి రూ.118 కోట్లు ఐటి కంపెనీల పేరుతో చంద్రబాబు దోచుకున్నారని ఆదాయ పనుల శాఖ గుర్తించి నోటీసు ఇచ్చిన నేపద్యంలో దానికి చంద్రబాబు ఇచ్చినటువంటి బదులును ఐటీ శాఖ తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు.  ఇన్ ఫ్రా కంపెనీలో సబ్ కాంట్రాక్టు రూపంలో ఈ రూ.118 కోట్లు దోచుకున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుందన్నారు. చంద్రబాబు ప్రధాన అనుచరుడు మనోజ్ వాసుదేవన్ ఇంట్లో ఇన్ కమ్ టాక్స్ వారు దాడులు జరిపి నేపథ్యంలో తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా ఆయన వద్ద లభించిన వివిధ ఆధారాల ద్వారా చంద్రబాబు రూ.118 కోట్లు తన ప్రభుత్వంలో తినేసినట్లుగా  బయటికొచ్చిందన్నారు. తప్పు జరిగినప్పుడు కూడా ఎవరూ మాట్లాడని విధంగా వ్యవస్థను తయారు చేసినటువంటి విధానాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. ప్రజాధనం వృధా అయినా సరే ప్రతిపక్షాలు మాట్లాడకపోవడం అన్యాయం అన్నారు. 2014 ఎన్నికల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తారని ఒకవేళ అలా చేయకపోతే ₹2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిన తెలుగుదేశం ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యోగేష్ అనే వ్యక్తితో కొన్ని కొన్ని లక్షల మంది యువతకు శిక్షణ ఇప్పిస్తున్నామని డొల్ల కంపెనీల సృష్టించి అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇన్ని కుంభకోణాలు చేసిన తెలుగుదేశం వారు వారి భవిష్యత్తుకే గ్యారెంటీ లేనప్పుడు ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారన్నారు. చంద్రబాబు చెప్పే మాటలను నమ్మేందుకు ప్రజల సిద్ధంగా లేరన్నారు. జరిగిన అవినీతి గురించి బట్టబయలు చేసి నిందితులను కచ్చితంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి కే వీధి ఎంపీపీ బోయిన కుమారి, వైస్ ఎంపీపీలు ఆనంద్, దేముడు, స్థానిక సర్పంచ్ పాంగి దుర్జో, బుజ్జి, స్థానిక ఎంపిటిసి సాంబమూర్తి, వైస్ సర్పంచ్ వల్లీ ప్రసాద్,కారే శ్రీనివాసు, నాయకులు బుజ్జి, వెంకటరావు, శివరామ్, నూకరాజు, అప్పారావు, స్వర్ణలత  దామనపల్లి సర్పంచ్ రామకృష్ణ , జిల్లా కార్యదర్శి కంకిపాటి గిరిప్రసాద్ ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసిన మంత్రి అల్లోల…

సత్తెనపల్లి రామకృష్ణ స్పూర్తితో నూతన విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా ఉద్యమం