పాడేరు నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా: జీకే వీధి మండలం కొంకితపాడు నుంచి నిమ్మలగొంది వరకు రహదారి నిర్మాణ పనులకు పాడేరు శాసనసభ్యులు భాగ్యలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు. 7.5 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణానికి రూ 2. 50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రహదారి కి శంకుస్థాపన కార్యక్రమం ఓ జాతరను తలపించింది. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న కలను ఈరోజు సహకారం అవుతుందన్న ఆనందం వీరందరిలో కనిపించింది .ఆ రోడ్డు పరిధిలో ఉన్న గ్రామాల వారు అంతా తమ తమ వాహనాల్లో శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి శాసనసభ్యులు భాగ్యలక్ష్మి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తాము తెలియజేసిన సమస్యను వెంటనే పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి లకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జగనన్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. తాను కూడా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఈ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తున్నారో అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యతా ఇస్తున్నారన్న విషయాన్ని పునరుద్ఘాటించారు.
ఎన్నో ఏళ్లనాటి కలను నెరవేర్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి గిరిజన తరుపున ధన్యవాదాలు తెలిపారు
రూ.75 కోట్లతో జిఎస్ పీ రోడ్లు
పాడేరు నియోజకవర్గంలో నిమ్మల గొందిలాంటి జిఎస్ పీ రోడ్లు నిర్మాణానికి 5 మండలాలకు రూ.75 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని భాగ్యలక్ష్మి సందర్భంగా తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఈ రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు. మర్రివాడ పంచాయతీ పరిధిలో ఎనిమిది గ్రామాల గడపగడప నిర్వహించినప్పుడే ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని త్వరలోనే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తామని చెప్పిన విధంగానే ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ రహదారి పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. అంతాడ పంచాయతీ ఎద్దు మామిడి, సింగిధార , గంపరాయి, టెంకల పలుకులు గ్రామాలు ఈ రోడ్డుతో అనుసంధానం చేసుకునేలా మరో రహదారి నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఫారెస్ట్ నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. మన అవసరాలతో పాటు అడవును కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అటవీ శాఖ నిబంధనలను అనుగుణంగా అవకాశాల మేరకు రహదారి నిర్మాణాలను అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆ శాఖకు ఆదేశాలు జారీ చేశారని ఆ నేపథ్యంలో ఉన్న స్థాయి అధికారులతో చర్చించి మంజూరు చేస్తున్నారన్నారు. ఈరోజు గిరిజన ప్రాంతంలో చాలా గ్రామాలకు రోడ్లు ఏర్పడుతున్నాయంటే కేవలం జగన్ గారి వల్లే సాధ్యమైందన్నారు. రోడ్లు లేక గిరిజన పడుతున్న ఇబ్బందులు ఈరోజు స్వయంగా చూసామన్నారు. నిమ్మల గొందు లాంటి మారుమూల ప్రాంతానికి కూడా అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అంటే కేవలం సీఎం దయేనని, ఆయన ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇదంతా సాధ్యమైందని తెలిపారు. అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మనమంతా అండగా నిలవాలని ఆయనకు రుణపడి ఉండాలని తెలిపారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు లేకపోయి ఉంటే అమ్మ ఒడి , చేయూత వంటి సంక్షేమ పథకాలు కూడా అర్హులైన పేదవారికి అందేవి కాదన్నారు. ప్రతిపక్షాలకు ఇప్పుడే మెలకువ వచ్చిందని ఈ నాలుగేళ్లు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి వారి కళ్ళకు కనిపించడం లేదన్నారు. ఈ నాలుగేళ్లలో నిత్యం ప్రజలతో ఉంటూ వారి అభివృద్ధి కార్యక్రమాలు వారికి సంక్షేమ ఫలాలు అందించడంలో నిత్యం కృషి చేస్తున్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమేనని గర్వంగా చెబుతున్నాను అన్నారు. "మీ నాయకుల్లా సెల్ఫీ చాలెంజ్ లు చేసుకునే పరిస్థితి తమది కాదని గ్రామాల్లో కెళ్ళి సమస్యలను గుర్తించి వాటి పరిష్కరించేలా వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఆదేశించారన్నారు. ప్రత్యక్షంగా గ్రామాల్లో తిరిగి సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకెళ్తున్నాం కాబట్టే భారీ ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సచివాలయాల నిర్మాణం, నాడు – నేడు కింద పాఠశాలలు , హాస్పిటల్స్ నిర్మాణం, రహదారులు ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమేనని అది తాము మాత్రమే చేయగలుగుతున్నామన్నారు. కళ్ళున్న కబోధులకు, నటించే వారికి తామేమి చెప్పలేమన్నారు. పచ్చకామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టుగా ఈరోజు ఎంత అభివృద్ధి జరుగుతున్నా వారికి ఎక్కడా కనిపించడం లేదనడం హాస్య స్పందన ఉందన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని తాము చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిని చూసి హర్షించగలిగితే హర్షించండి గానీ తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ఆరోపణలు చేస్తున్నవాళ్లు ఎవరైనా నిమ్మలగొంది, సింగిధార, ఎద్దు మామిడి ఎప్పుడైనా రాగలిగారా? అని ప్రశ్నించారు. అటవీ శాఖ క్లియరెన్స్ వచ్చిన వెంటనే కొంకితపాడు నుంచి అంతాడ వరకు రహదారిని కూడా వేసేది తమ ప్రభుత్వమే అన్నారు. ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో ఆలోచించి తమను ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సత్యవతి, ఎంపీటీసీ పిల్లా భవాని, గ్రామ పెద్ద సత్తిబాబు, ఎంపీపీలు బడుగు రమేష్, బోయిన కుమారి, మండల అధ్యక్షులు జల్లిబాబులు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు, కుందారి రామకృష్ణ, సర్పంచ్ చందు, పిఎసిఎస్ చైర్మన్ సూరిబాబు, మండల కన్వీనర్ బండి సుధాకర్, సీనియర్ నాయకులు గాడి సత్తిబాబు, శేఖర్, తిరుపతి, లోవరాజు, జీకే వీధి వైస్ ఎంపీపీలు ఆనంద్, దేవుడు, మాజీ జడ్పిటిసి మత్యరాజు, జిల్లా కార్యదర్శి కంకిపాటి గిరిబాబు, సీనియర్ నాయకులు నారాయణ, రామారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]
