- నందిగామ సెప్టెంబర్ 7 గురు న్యూస్:
నందిగామ పట్టణంలోని జయ సిద్ధార్థ హై స్కూల్ లో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు చిన్ని కృష్ణుడు, గోపిక, రాధల వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు. రాధాకృష్ణుల జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. వెన్నకుండలతో బాలబాలికల హడావుడి ముచ్చటగొలిపింది. పిల్లనగ్రోవితో చిన్నారులు ఆటా పాటలు అందరినీ అలరించాయి. పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థినీ విద్యార్థులు పలు వేషధారణల్లో ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి విజయలక్ష్మి, కరస్పాండెంట్ రామ్మోహన్, ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గోన్నారు.
[zombify_post]