డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశం చైర్‌పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన ఈ నెల 8న జరగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో 22 అంశాలను చర్చించనున్నారు. జోన్–2 పరిధి 8వ వార్డు తారకరామనగర్‌లో రూ.49.98 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం, జోన్–7లో 80 నుంచి 84వ వార్డు వరకు పారిశుధ్య నిర్వహణకు నియమించిన అదనపు సిబ్బందిని మరో 3 నెలలు కొనసాగించడం, జోన్–3 పరిధి 20వ వార్డు మానసిక ఆస్పత్రి జంక్షన్ నుంచి లెండివనం, ఆస్పత్రి డౌన్‌రోడ్డు వరకు రూ.49.65 లక్షల విలువలతో ప్రహరీ నిర్మాణం, జోన్–7 పరిధి 84వ వార్డు సాలపువానిపాలెం విలీన గ్రామం వద్ద రూ.27.70 లక్షలతో ఆర్‌సీసీ డ్రెయిన్, ఎస్‌డబ్ల్యూ డ్రెయిన్, ఆర్‌సీసీ కల్వర్టు నిర్మాణం, జోన్–7 పరిధి 83వ వార్డు సీతారాం కల్యాణ మండపం వేల్పుల వీధి వద్ద మేజర్ డ్రెయిన్‌పై ఆర్‌సీసీ కల్వర్టు కూల్చివేసి, రూ.41 లక్షలతో పున:నిర్మాణంపై సభ్యులు చర్చించనున్నారు. 2022–23, 2023–24 ఏడాదికి ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న శాశ్వత పారిశుధ్య కార్మికుల కోసం రూ.39,8,139 అంచనాతో ఈ–ప్రొక్యూర్‌మెంట్ టెండర్ విధానం ద్వారా కొబ్బరి నూనె కొనుగోలు, జోన్–4 పరిధి 32వ వార్డులో అభివృద్ధి పనుల్లో భాగంగా నాలుగు పనులు రద్దు చేస్తూ, ఆ స్థానంలో భీమ్‌నగర్ వద్ద జీ 1 తరహాలో కల్యాణ మండపం నిర్మాణం, జోన్–3 పరిధి 14 నుంచి 27వ వార్డు వరకు, బీచ్‌రోడ్డులో పారిశుధ్య నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, జోన్–2 పరిధి 8వ వార్డులో సిల్వర్ వోక్స్ స్కూల్ నుంచి ఒమ్మివానిపాలెం వంతెన వరకు తారు రోడ్డు పునరుద్ధరణ, జోన్–6 పరిధి 76వ వార్డులో భరత్‌నగర్ వద్ద మేజర్ డ్రెయిన్ నిర్మాణం, జోన్–3 పరిధిలో జీవీఎంసీ దుకాణాలు, కల్యాణ మండపాలు మూడేళ్ల పాటు లీజు, తదితర అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి.
[zombify_post]