నాతవరం, అనకాపల్లి జిల్లా: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఈనెల 8వ తేదీన మండల కేంద్రంలో కలెక్టరు రవిపట్టాన్‌శెట్టి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం జరుగుతుందని తహసీల్దార్ ఎస్.ఎస్.వి.శ్రీనివాస్‌నాయుడు చెప్పారు. ఆయన మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. ప్రభుత్వం ప్రజలకు మరింత చే రువలో సేవలు అందించాలన్న లక్ష్యం మేరకు ఈసా రి స్పందన కార్యక్రమం (జగనన్నకు చెబుదాం) నాతవరంలో జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయించారన్నారు. ఈ స్పందనలో కలెక్టరు, జాయింట్ కలెక్టరు, జిల్లా స్థాయి అధికారులంతా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో నేరుగా కలెక్టరు ప్రజల నుంచి ఽఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. సమస్యలను అక్కడే సంబంధిత శాఖ అధికారితో మాట్లాడి పరిష్కారిస్తారన్నారు. స్పందనలో ఫిర్యాదుదారులకు రశీదు ఇవ్వడం జరుగుతుందని, దీనికోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ అదేశాలు ప్రకారం ఈ స్పందన కార్యక్రమాన్ని మొదటగా జిల్లాలో నాతవరంలో నిర్వహించాలని కలెక్టరు నిర్ణయించారన్నారు. మండల ప్రజలు ప్రజాప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హనుమంతరావు, వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.
[zombify_post]