బోయినిపల్లి శివారులోని బ్రిడ్జి నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి
బారి వర్షాల వల్ల బోయినిపల్లి కొదురుపాక మధ్యలో ఉన్న కల్వర్టు కుంగి పోవడంతో ప్రమాదం పొంచి ఉంది
రాత్రి వేళ ఆదమరిచి ప్రయాణిస్తే అంతే సంగతులు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి నుండి కొదురుపాకకు వెళ్లే రహదారి ఏదైతే ఉందో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల,అలాగే రోడ్డు వెంబడి పెద్దపెద్ద గ్రానైట్ లారీలు లోడింగ్ లు వెళ్లడం వల్ల ఈ బ్రిడ్జి పూర్తిగా కృంగిపోయి ప్రమాదకరమైన స్థాయికి చేరుకొంది.
ఈ సందర్బంగా గురిజాల శ్రీధర్, అలువాల అజయ్ లు మాట్లాడుతూ భారీ వాహనాలు వెళితే భారీ నష్టం,ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి, పోలీస్ శాఖ వారు కూడా దృష్టి పెట్టి,ఈ బ్రిడ్జి మీద నుండి పెద్దవాహనాలు వెళ్లకుండా రోజువారి పికెటింగ్ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడున్న పాలకవర్గాలకు, ఎన్నో సందర్భాలలో అధికారుల దృష్టికి,పాలకుల దృష్టికి తీసుకువచ్చే క్రమంలో భాగంగా పార్టీలకతీతంగా ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేసినా కూడా ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా, ప్రజల ప్రాణాలంటే లెక్కచేయకుండా,ప్రజా సమస్యలు గాలికి వదిలేసి, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది.ఈ బ్రిడ్జి మార్గాన స్కూలుకు వెళ్లే విద్యార్థులకు కూడా వర్షాకాలం వచ్చిందంటే వారు స్కూళ్లకు వెళ్లాలంటే కూడా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. విద్య కూడా నష్టపోతున్నారు.అలాగే ప్రతిరోజు కొదురుపాక నుంచి బోయినిపల్లి మీదుగా గంగాధరకు నిత్యం వేలాది వాహనాలు ఈ రోడ్డు మార్గాన్నే వెళ్తాయి.కాబట్టి ఇప్పటికైనా ఈ పాలకులు మేలుకొని యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి,నాణ్యతతో కూడిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనీ కోరారు.
[zombify_post]