వడ్డెరల ఆత్మ గౌరవం పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి – ఎమ్మెల్యే డా.సంజయ్
సారంగాపూర్ మండలం ఒడ్డెర కాలనీకి చెందిన 20 మంది నాయకులు బిజెపి కాంగ్రెస్ పార్టీ నుండి సారంగాపూర్ మండల పాక్స్ వైస్ చైర్మన్ బాపి రాజు, గ్రామ అధ్యక్షులు చిన్నా రెడ్డి అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సమక్షంలో చేరారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వడ్డెర సంఘ భవన అదనపు పనుల నిమిత్తం 3 లక్షల ప్రొసీడింగ్స్ కాపీని ఎమ్మెల్యే సంఘం సభ్యులకు అందజేసారు. ఎమ్మెల్యే కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్,మాజీ సర్పంచ్ మద్దెల ఆనంద్,మాజీ ఎంపీటీసీ రవీందర్ రావు,మాజీ ఉప సర్పంచ్ ఆకుల తిరుపతి,బొదాసు మల్లేష్, దండుగుల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]