-
విజయవాడ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర రేపటికి (సెప్టెంబర్ 7) నాటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 4 గంటలకు ఆంధ్ర రత్న భవన్ నుండి ధర్నా చౌక్ వరకు జరుగు మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు అమీన్ భాయ్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడలేని విధంగా, ఏ పార్టీ నాయకుడు తలపెట్టిన విధంగా రాహుల్ గాంధీ గత సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 136 రోజులపాటు 4,081 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 75 జిల్లాలు, 76 లోక్సభ స్థానాల్లో అవిశ్రాంతంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టి కోట్లాదిమందిదేశ ప్రజల్ని ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారిలో భరోసా కల్పించి, సమైక్యపరిచి జాగృతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషు లు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత్ జోడో సంఘీభావ యాత్రను జయప్రదం చేయాలని కోరారు.
[zombify_post]