ఎస్. కోట మండలంలో బుధవారం మధ్యాహ్నం వరకు ఎండలు కాసినప్పటికీ వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుని ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన భారీ వర్షం నమోదయింది. కురిసిన వర్షానికి అన్నదాతలు ఆనందం వ్యక్తం చేయగా స్థానిక ప్రజలు హాయిగా సేద తీరుతున్నారు. ఇదిలా ఉంటే ఇదే తరహా వర్షాలు మండలంలో కురిస్తే ఆయా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు నిండుతాయని తద్వారా పంటలు పుష్కలంగా పండుతాయని రైతులు అంటున్నారు.
[zombify_post]