అభివృద్ధికి మళ్ళీ పట్టం కడతాం అంటున్న పెద్దకొరూకొండి గ్రామస్థులు
నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం, పెద్దకోరుకొండి గ్రామంలో మాదిరాజు అన్నంరాజు ఇంటి వద్ద కార్యకర్తలతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిపై, చేపట్టనున్న అభివృద్ధి పనుల విషయమై పలు విషయాల పట్ల సమీక్షించారు. అభివృద్ధితో గ్రామ స్వరూపాన్ని మార్చిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ను మళ్ళీ శాసనసభ్యులుగా గెలిపించుకొని మరల పట్టం కడతామని గ్రామస్తుల ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాలేపు రామారావు, కనగాల వెంకటరావు, జడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, ఎంపీటీసీ చిట్టిబాబు, ఇస్సాకు, మచ్చ హనుమంతురావు, వెంకటేశ్వరరావు, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు, వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వేమిరెడ్డి వెంకటేశ్వరరా రెడ్డి, వేమిరెడ్డి రామకోటిరెడ్డి, ఇరికి పుల్లయ్య, తాళ్లూరి నరసింహారావు తదితరులున్నారు.
[zombify_post]