సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు.
రాజోలు మండలం బి. సావరంగ్రామం లో బుధవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. అదేవిధంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా సంబంధించిన అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
[zombify_post]