విశాఖపట్నం: కల్లు సీసాలను స్కూల్ కు తీసుకొచ్చిన విద్యార్థులు సంఘటన విశాఖలో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని టీపీటీ కాలనీలోని ఎన్.పి.సిహెచ్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కల్లు సీసాలను బ్యాగులో పెట్టుకుని పాఠశాలకు వచ్చారు. అయితే కల్లు సీసాలను గమనించిన ఉపాధ్యాయడు ఈ విషయాన్ని పాఠశాల హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. దీంతో ఆయన ఆ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా ఇటీవల కాలంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లోని ఓ గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు మాదక ద్రవ్యాలు సేవిస్తూ పట్టబడటంతో ఉన్నతాధికారులు సూచన మేరకు వారికి టీసీలు ఇచ్చేశారు.
[zombify_post]