అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అటవీ రేంజ్ కార్యాలయాన్ని, కొప్పుకొండ, నల్లగొండ అటవీ టేకు ప్లాంటేషన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొప్పుకొండ, నల్లగొండ అటవీ ప్లాంటే షన్లో రెండేళ్లలో సుమారు 2,500 టేకు చెట్లు నరికి గొలుగొండ కలప డిపోకు తర లించడంతో పాటు వేలం పాట ద్వారా నిర్వహించడం ద్వారా అటవీశాఖకు రూ.కోట్లలో ఆదాయం వచ్చిందన్నారు.
అలాగే నవంబరు, డిసెంబరు నెలల్లో టేకు చెట్లు నరికి కలప డిపోలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలప అక్రమ రవాణాపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే తక్ష ణమే చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రజలు కూడా సహకరించాలని కోరారు. మూడు నెలలకొకసారి నిర్వహించే తనిఖీల్లో భాగంగా కృష్ణాదేవిపేట రేంజ్ లోని కొప్పుకొండ, నల్లగొండ అటవీ ప్లాంటేషన్లు, రికార్డులను పరిశీలించామన్నారు.
ఈ కార్యక్రమంలో స్క్వాడ్ రేంజ్ర్ గంగరాజు, కిరణ్, డీఆర్వో రాజేశ్, గార్డు ఎరుకులమ్మ, తదితరులు పాల్గొన్నారు….
[zombify_post]