రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లయన్స్ క్లబ్ నకు చెందిన లయన్ మరిపెల్లి అంతయ్య,లయన్ గడప రఘుపతిరావు,లయన్ అంబటి శంకర్
లయన్ బండి యాదగిరి లను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మంచే రమేష్, జిల్లా క్యాబినెట్ సభ్యులు లయన్ తీపిరెడ్డి వెంకట్ రెడ్డి, లయన్ కర్ణబత్తుల దేవేందర్ రావు, లయన్ తీగల శశిధర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడమైనది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మంచె రమేష్ మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యతలను చేపట్టిన మన క్లబ్ కు చెందిన నలుగురు ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందని, ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యతను మోస్తున్న ఉపాధ్యాయులను సన్మానించి వారి సేవలకు గుర్తింపు ఇవ్వడం కోసం ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు అన్నారు. జిల్లా క్యాబినెట్ సభ్యులు లయన్ తీపిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతలను ఉపాధ్యాయులు ఎల్లవేళలా నిర్వహిస్తూ దేశకీర్తిని పెంచే ఉత్తములుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
[zombify_post]