అల్లూరి సీతారామరాజు జిల్లా: నాటుసారా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జి.మాడుగుల ఎస్సై శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. మండలంలోని రచ్చపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అన్నవరం నుంచి 50 లీటర్ల నాటుసారా తో వస్తున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకున్నామన్నారు. వీరిని అరెస్టు చేసి పాడేరు కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
[zombify_post]