మిత్రురాలి భర్త కిడ్నీలు చెడిపోయాయి
– 2013-14 బాల్య మిత్రుల 9800 ఆర్థిక సహాయం అందజేత
బాల్య మిత్రురాలు ఆ పతిలో ఉందని తన భర్త రెండు కిడ్నీలు పాడై తల్లిదండ్రుల వద్ద నివాసముంటున్న స్రవంతికి 2013- 14 పదవ తరగతి స్నేహితులు 9వేల 8వందల ఆర్థిక సహాయన్ని సోమవారం అందజేసి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామానికి చెందిన గొర్రె మల్లయ్య, ఎల్లవల ఒక్కగాను ఒక్క కూతురు స్రవంతిని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి గ్రామానికి చెందిన నక్క ప్రవీణ్ తో గత ఆరు సంవత్సరాల క్రితం కట్న కానుకలు ఇచ్చి పెండ్లి చేశారు. ప్రవీణ్ కు తల్లిదండ్రులు లేరు వీరికి మూడేళ్ల కుమారుడు, ఏడు నెలల పసిపాప ఉన్నారు. వీరి కాపురం కొన్నాళ్ళు బాగానే జరిగింది.గత కొన్ని నెలల క్రితం తన భర్త రెండు కిడ్నీలు చెడిపోయి ఆర్థిక ఇబ్బందులతో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రవీణును తీసుకొని తల్లిగారింటికి వచ్చి నివసిస్తుంది. భర్తను రక్షించుకోవాలనే తపన ఉన్న ఆర్థిక ఇబ్బందులతో తన కాపురం చదరంగంగా మారింది. సమాచారం అందుకున్న తోటి బాల్యమిత్రులు తమ వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందజేసి వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒగ్గు మహేష్, చందుపట్ల చందు, సతీష్,దోమల వెంకట్ కోరుతున్నారు.
[zombify_post]