in

ఉద్యోగాలు లేక అల్లాడుతున్న యువత

పాడేరు నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. సరియపల్లి గ్రామంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. యువతకు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని చెప్పారు. తెదేపా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో ఎంతో కాలంగా గిరిజనులతో మమేకమైన కొండ కుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గిరిజనులతో ఎటువంటి సంబంధం లేని బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రయత్నిస్తోందన్నారు. తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట సురేష్‌కుమార్‌, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు వెంకటరమణ, మండల రైతు సంఘం అధ్యక్షులు కొండబాబు, యూనిట్‌ ఇన్‌ఛార్జి శ్రీను, గ్రామస్థులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

85 ఫిర్యాదులు-న్యాయం చేస్తాం. జిల్లా ఎస్పీ.

అల్లూరి జిల్లా లో తప్పని డోలు మోతలు