అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని రైవాడ జలాశయంలో ఈదురుగాలులకు పడవ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. రైవడ గ్రామానికి చెందిన చల్లా వెంకట జోగారావు శనివారం మధ్యాహ్నం రైవాడ జలాశయం అవతల ఒడ్డున ఉన్న పొలానికి వెళ్ళేందుకు పడవపై బయలు దేరాడు అయితే ఆ సమయంలో ఈదురుగాలులు వీడయంతో పడవ బోల్తా పడి జలాశయంలో గల్లంతయ్యాడు. దీంతో కుటుంబీకులు గాలింపు చేపట్టగా సోమవారం జోగారావు మృతదేహం లభ్యం అయింది. దీంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
[zombify_post]