టిడిపి నాయకులపై పురపాలక సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
నందిగామ సెప్టెంబర్ 4 గురు న్యూస్ :
నందిగామ పురపాలక సంఘ కమీషనర్ డా. యస్. జయరాం ను ది. 03-09-2023 న వ్యక్తిగత దూషణలు చేసిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మరియు టి.డి.పి. పార్టీ నాయకులు బహిరంగంగా అవమాన పరచినందుకు నందిగామ పురపాలక సంఘ సిబ్బంది మరియు అధికారులు నిరసన వ్యక్తం చేస్తూ పట్టణ అభివృద్ధి కార్యక్రమములో భాగముగా ప్రభుత్వ ఆదేశములకు అనుగుణముగా ఉద్యోగ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను వ్యక్తిగత వేధింపులకు గురిచేయడం, దాడి చేయడం మరియు బహిరంగంగా అవమానపరచడము ఖండిస్తూ సదరు అధికారి పని తీరును గుర్తిస్తూ ప్రభుత్వం వివిధ అవార్డులను ప్రదానం చేయబడినది అని తెలియజేస్తూ మరల ఇటువంటి చర్యలు చేపడితే ఉద్యోగ సంఘాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొనుటకు మా పురపాలక సంఘ సిబ్బంది మొత్తం ఏకమై ఒకే తాటిపై వెల్లబడునని తెలియజేస్తూ మరల వ్యక్తిగత దూషణలకు పాలుపడినచో చట్టప్రకారము దాడి చేసిన వారిపై పొలీసు కేసు నమోదు చేయించి తగిన చర్యలు తీసుకొనుటకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము అని తెలియపరిచారు.
[zombify_post]