- విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతారామపురానికి చెందిన కర్రి నారాయణ రావు(45) తాపీమేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం గ్రామంలోని ఒక ఇంటిలో పనిచేస్తుండగా వెనుక ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వ హించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జనార్దనరావు తెలిపారు. మృతుడికి భార్య ఝాన్సీ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
[zombify_post]