హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు కుడితాడు చిరంజీవి గారి అధ్యక్షతన నిర్వహించిన చెరికల కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు_*
గ్రామంలో జెఎస్అర్ గారి సమక్షంలో పలువురు యువకులు గ్రామస్తులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.
ముందుగా గ్రామానికి చేరుకున్న జెఎస్ఆర్ గారికి గ్రామస్తులు మహిళలు కోలాటం డీజే తో ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామ పంచాయితీ లలో జరిగే అభివృద్ధి పనులు కేంద్ర నిధులతోనే సాగుతుందని,సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని,దళిత బందు,బీసీ బందు,డబుల్ బెడ్ రూం ఇళ్ళ హామీ ఏమైందని ప్రశ్నించారు. స్థానికేతరుడైన ఎమ్మెల్యే వల్ల హుస్నాబాద్ కి ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు.భారతీయ జనతా పార్టీ నీ అధికారంలోకి తీసుకురావడానికి యువకులు,ప్రజలందరూ సిద్దంగా వుండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి,భీమ దేవర పల్లి మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్వి రాజ్ గౌడ్, జనగాని కిష్టయ్య, చిదూరాల వెంకటేష్, పల్లేపాటి మధుకర్, అరేపల్లి వినోద్, పెరుగు మధు, చదిరం రాకేష్, దాసరి అరుణ్, వెంకట్ రాజ్యం, తిరుపతి రెడ్డి, రమణ రెడ్డి, సదానందం, తేజ, వెంకట్, తదితరులు పాల్గొన్నారు,,_*
[zombify_post]