in

బాబు ష్యురిటీ భవిష్యత్ గ్యారెంటీ

palasa

పలాస నియోజకవర్గం మందస మండలం హంసరాలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పలాస నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి గౌతు శిరీష గారి ఆధ్వర్యంలో మహాశక్తి కార్యక్రమాన్ని మరియు బాబు ష్యురిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమ నమోదు కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా రచ్చబండ లో శిరీష గారు మాట్లాడుతూ ప్రశ్నిచే వారిపై కేసులు పెట్టడం తప్ప అభివృద్ధి పై ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని,గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, త్రాగు నీరు, సాగునీరు, ఆశ్రమ పాఠశాలను స్థాపించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని,ఐటిడిఎ మన్యం జిల్లా కు వెళ్లిపోవడం తో గిరిజనుల సమస్యలు ఎదుర్కొంటున్నారు అని,తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మల్లీ మన జిల్లాలో ఐటిడిఎ ను ఏర్పాటు చేస్తాం అని తెలియజేశారు. ఈ రాష్ట్రం బాగుపడాలన్న యువతకు ఉద్యోగ ఉపాది అవకాశాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు లాంటి సమర్ధుడైన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు
అలాగే మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేప్పట్టిన తరువాత ఇచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి సర్టిఫికేట్ లు జారీ చేస్తున్నారు అని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భావన దుర్యోధన,వర్కింగ్ ప్రెసిడెంట్ రట్టి లింగరాజు,ప్రధాన కార్యదర్శి లబ్బ రుద్రయ్య,నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ముదుముంచి నవీన్ కుమార్,క్లస్టర్ ఇంచార్జి తమిరి భాస్కరరావు, ముంజేటి చంద్రశేఖర్, విజయ్ గౌడ,పండు గౌడ,ఘన శ్యామ్ గౌడ,బెహర చంద్రశేఖర్, పూర్ణ గౌడ,రోహిణి,విజయలక్ష్మి సవర,బురద పురుషోత్తం, సవర నాగేంద్ర, సవర పాపారావు, బెహర ప్రసాద్,రాజేష్ గౌడ,సిర్ల కృష్ణారావు, తామాడ ధర్మారావు, గున్న విక్రమ్, తదితరులు పాల్గొన్నారు…à

Report

What do you think?

రాఘవేంద్ర స్వామి 352వ ఆరాధన మహోత్సవాలు

గురుకుల క్రీడా పాఠశాలకు అవార్డు