పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా,ఆగస్టు 31: జాతీయ క్రీడా దినోత్సవం పుష్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రతిభా అవార్డు జిల్లాస్థాయిలో అల్లూరు జిల్లా స్థాయిలో అరకు వ్యాలీ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల క్రీడా పాఠశాల ప్రథమ స్థానమును పొందింది. ఈ సందర్భంగా గౌరవ ప్రాజెక్టు అధికారి వారు శ్రీ వి అభిషేక్ మరియు గిరిజన సంక్షేమ శాఖ సంక్షేమ శాఖలు ఉప సంచాలకులు శ్రీ ఐ కొండలరావు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ పి ఎస్ ఎన్ మూర్తి మరియు పాఠశాల సిబ్బందిని ప్రశంసించడం జరిగింది.