నీరు రాకుండా నదిలో స్నానం ఎలా చేస్తారు?
సొంత పార్టీపైనే కక్ష సాధింపులెందుకు? -చల్లాను ప్రశ్నించిన వైకాపా సీనియర్లు తాతారావు, వాసు
నగరపాలక సంస్థ పరిధి కొత్తపేటలో నిర్మించాలనుకుంటున్న సీసీ రోడ్డు ప్రజల అవసరాలు, ఆ ప్రాంత అభివృద్ధి కోసమేనని చల్లా శ్రీను చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటైనా నిజం ఉందా అని, 132,137 పోలింగ్ బూత్ల వైకాపా ఇన్ఛార్జ్లు గెంజి తాతారావు, గెంజి వాసులు ప్రశ్నించారు. ఈమేరకు గురువారం వారు సంయుక్తంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొత్తపేట ప్రజలు నాగావళి నదిలో స్నానం చేసుకునేందుకు అనుకూలంగా సీసీ రోడ్డు నిర్మాణానికి తలపెట్టానని చల్లా శ్రీను చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. వాస్తవాలు ఏమిటో కొత్తపేట ప్రజలకు తెలుసునన్నారు. ఇసుక మాఫియాకు లబ్ధి చేకూర్చేందుకే ఎప్పుడో 1979లో ప్రభుత్వం తమ కుటుంబానికి కేటాయించిన డి-పట్టా భూమి నుంచి సీసీ రోడ్డు నిర్మాణానికి చల్లా శ్రీను తెరలేపారన్నారు. ఇసుక మాఫియా నుంచి చల్లా శ్రీను టైర్ బండికి రూ.50 చొప్పున వసూలు చేస్తున్న విషయం వాస్తవం. కాదా అని వారు ప్రశ్నించారు. ఏ హోదాలో చల్లా శ్రీను నగరపాలక సంస్థపై అధిపత్యం చలాయిస్తున్నారో చెప్పాలన్నారు. ఆయన వైఖరి వల్ల రెవెన్యూ మంత్రి ధర్మాన తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం చల్లా శ్రీను చేసిన సేవలేమిటో చెప్పాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన కోసం తమ కుటుంబం పనిచేస్తోందని ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు కక్ష
సాధింపులకు దిగారన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని, ఈసారి మాత్రం సొంత పార్టీ నుంచే తమపై కక్ష సాధింపులు అధికమవ్వడం దురదృష్టకరమన్నారు. చల్లా శ్రీను కొత్తపేట ప్రాంతం నుంచి కార్పొరేటర్ గా పోటీ చేయాలని భావిస్తున్నారని, తమ కుటుంబం శ్రీను వెంట కాకుండా ధర్మాన కోసం పనిచేస్తుందడం వల్లే చల్లా ఈ చర్యలకు పాల్పడుతున్నారని. మండిపడ్డారు. కేవలం రాజకీయ అవసరాల కోసమే కొత్తపేట ప్రాంతాన్ని శ్రీను వాడుకుంటున్నారని విమర్శించారు. అతడి వైఖరి తెలియడంతో బాకర్సాల్పేట, విశాఖ-బి కాలనీ ప్రజలు శ్రీనును తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఆయన కొత్తపేటను ఎంచుకున్నారన్నారు. కొత్తపేట ప్రజలు ఎంతో చైతన్యవంతులని అనేక సందర్భాల్లో రుజవైందన్నారు. గతంలో చల్లా శ్రీను తండ్రి లక్ష్మీనారాయణ కొత్తపేట ప్రాంతం. నుంచి ఆయన అనుచరుడు బలగ శివప్రసాద్ పట్నాయకు కౌన్సిలర్గా బరిలో నిలిపితే ఇక్కడి ప్రజలు ఓడించిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీలతో సంబంధం లేకుండా డాక్టర్ గుంపా శివప్రసాద్ను కౌన్సిలర్గా గెలిపించిన చరిత్ర కొత్తపేట ప్రజకు ఉందన్నారు. ఇవన్నీ చల్లా శ్రీను జ్ఞాపకం తెచ్చుకోవాలని సూచించారు. వైకాపా అధికారంలో ఉంది కాబట్టే చల్లా శ్రీను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తాను ఉద్యోగస్తుడినని, రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని చల్లా శ్రీను పలాయనం చిత్తగించలేదా? అని నిలదీశారు. రాజకీయాల్లో కక్ష సాధింపులు పనికి రావన్నారు. ఇప్పటికైనా తన వైఖరిని శ్రీను మార్చుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దమ్ముంటే వీటన్నింటిపైనా చల్లా శ్రీను బహిరంగ చర్చకు రావాలని ఆ ప్రకటన ద్వారా గెంజి, తాతారావు, గెంజి వాసులు సవాల్ విసిరారు.
This post was created with our nice and easy submission form. Create your post!