in , , ,

ప్రియమైన నాయుడు గారికి..!

  • ఉభయకుశలోపరి..

——————————

ప్రియమైన నాయుడు గారికి..!

ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడు..సామాన్యుడు వ్రాయు లేఖ!

అయ్యా ! మీరు అధికారంలో ఉన్నపుడు మీ విలువ తెలియలేదు..!

మా అయ్యకు ..రెండువేలు పెన్షను వచ్చేది..నాకు తెల్లకార్డు మీద ..బియ్యం కందిపప్పు..నూనె వచ్చేది..!

డీలరు అగ్గగ్గలాడుతూ నెలలో మొదటి వారం ముగిసే లోపల రేషను ఇచ్చేసేవాడు..!

మా పక్కింటి రజకులకు..మంచి బరువైన ఇత్తడి ఇస్త్రీపెట్టె..వాషింగ్ మెషీను..గూడ్స్ ఆటోలో తీసుకొచ్చి ఇంటికాడ దింపారు..!

మా వీధి చివర వీర్రాజు కాలం తీరి చనిపోయాడు..!

మట్టి ఖర్చులకు డబ్బు ఇచ్చారు..!

పదోరోజుకల్లా వాళ్ళావిడ కి రెండులక్షలు..అక్షరాలా రెండులక్షలు చెక్ ఇచ్చిపోయారు..!

అంతకుముందు..ట్రాక్టరు మీద నుండి పడిపోయిన అబ్బులు కి..మట్టి ఖర్చులతో పాటు ఐదులక్షల చెక్ వాళ్ళ బిడ్డలకు అందచేసారు..!

వాళ్ళావిడకి వితంతు ఫించను వ్రాసారు..!

మా వీధుల్లో రోజు చప్పట్లు కొట్టుకుంటూ..కనిపించినవాళ్ళనందరినీ డబ్బులు అడుక్కునే హిజ్రాలు..ఫించన్ వస్తుందని గంతులేసి పాటలు పాడి సందడి చేసారు..!

రెండు చేతులు లేని బూరయ్య కైతే ఏకంగా పదివేలు నెలనెలా ఠంఛన్ గా డబ్బు పడిపోయేది..!

మా దళిత సోదరులు ఆశీర్వాదానికి..రత్నరాజుకి ఇన్నోవా కార్లు వచ్చాయి..అద్దెకు తిప్పుకునేవారు..!

పెదకాపు గారి అమ్మాయి ..అమెరికా వెళ్ళింది చదువుకోవటానికి..!

చంద్రబాబు పంపాడని అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు..!

మీరంటే కిట్టని వాళ్ళు..చంద్రబాబు జేబులోంచి ఇస్తున్నాడా అన్నారు..!

గవర్నమెంట్ సొమ్మన్నా ఇవ్వాలని మీకనిపించి నందుకు అందరూ మిమ్మల్ని భలే పొగిడేవారు..!

వెంకట్రామయ్యగారు..టేకుమూడి అప్పారావు గారు..ఎల్చూరి వెంకట్రావు గారు ..వీళ్ళందరికీ లోన్ రద్దయింది..!

వెంకట్రామయ్య గారికి తొంభైవేలు..మిగతావాళ్ళకు ఏభైవేలు చొప్పున ఒకేసారి బెడద వదిలి పోయింది..!

మా వీధిలో బురద బురద గా ఉండేది..ఒక పదిరోజులు ఇబ్బంది పడ్డాము…సిమెంట్ రోడ్డు వేసేసారు..!

అందరికీ మరుగుదొడ్లు శాంక్షను అయ్యాయి..!

కట్టేసుకున్నాము..లేకపోతే ఊరిచివర రోడ్లు గబ్బెత్తిపోయేవి..!

వారానికి సరిపడా పని ఉండేది..మాకే బద్దకం వచ్చి రెండురోజులు ఎగ్గొట్టే వాళ్ళం..చేతి నిండా డబ్బు..!

తుపాన్లు మమ్మల్ని వదలవు..ప్రతీ ఏడు నవంబర్ లో ఒక రౌండు వేస్తాయి..!

ఇళ్ళు కూలిపోయాయి..గాలికి కరెంటు స్దంభాలు పడిపోయాయి..పంటలైతే సర్వనాశనం అయిపోయాయి..!

ఏమాట కామాటే చెప్పుకోవాలి..నువ్వు దగ్గరుండి..సెట్ చేసేసావు..అప్పటికప్పుడు నష్టపరిహారం ఇప్పించావు..!

అయినా కొంత మంది నీమీద అరిచారు..!

సర్లే ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు..!

పోలవరం కాడికి బస్సులో వెళ్ఖి చూసొచ్చాము..!

రాజధాని బాగా కడతన్నాడని చెప్పుకునేవారు..!

ఈలోగా మళ్ళీ నీమీద తేడాగా చెప్పుకోవటం మొదలెట్టారు..!

వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని తెలుసు..!

కొందరు అతను ఇస్తానన్న వాటికి ఆశ పడి ఉండవచ్చు..!

అయ్యా ..ఎలక్షను లో వాళ్ళు డబ్బులు బాగానే ఇచ్చారు..!

మీ వాళ్ళు కూడా ఇస్తారని చూసాము..పోలీసులు పట్టేసుకున్నారని తెలిసింది..!

అయ్యా బాబు గారు ..మా ఊరిలో కొందరు అతని మాయలో పడ్డారేమో కాని నేను నాతో పాటు చాలామందిమి మీ వెనుకే ఉన్నామయ్యా!

రిజల్ట్స్ వచ్చిన్నాడు..బుర్రపాడయిపోయింది..!

ఏదో మాయజరిగిపోయిందనుకున్నాము..!

అయాల ఎవరికీ స్దిమితం లేదు..ఎదుట పార్టీ వాళ్ళు రెచ్చిపోయి ఒక రౌండ్ వేసారు..!

వాళ్ళ బళ్ళకు సైలెన్సర్లు పీకేసి..చేతుల్లో కర్రలు..కత్తులు పట్టుకుని వీరంగం ఆడేసేరు..!

వాళ్ళలో చాలా మంది..మీ వల్ల లబ్ది పొందిన వారున్నారు..!

మీ వాళ్ళు కూడా ఆడూ ఈడూ అని చూడకుండా అందరికీ పంచిపెట్టారు..!

అయ్యా నీకెలాగ ఉందో తెలియదు కాని..మాకు దూల తీరిపోతుంది..!

ఇసుకలేదు..పనిలేదు..!

మందు కొనుక్కునే పరిస్దితి లేదు..!

టౌనుకి పోయినప్పుడు ఐదురూపాయలతో బువ్వతినేసే వాళ్ళం ..వాళ్ళమ్మా కడుపు మాడా! అవి ఎత్తేసారయ్యా!

నవరత్నాలంట పది మంది ఉంటే ముగ్గురు కి వస్తున్నాయి..!

వలంటీర్లయితే భలే బెదిరిస్తున్నారు..వాళ్ళు చాలా పెత్తనం చేసేస్తున్నారు..!

మొన్న రోడ్డు మీద మాటా మాట వచ్చి తన్నుకున్నాము..నన్ను మా వాళ్ళను చితక్కొట్టి మామీదే కేసుపెట్టారు..!

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావు..!

నీవు లేక దిక్కులేని చుక్కలయ్యాము.. పాట ఎఫ్ ఎమ్ రేడియోలో వస్తుంటే..నువ్వే గుర్తుకొచ్చావు..!

నిన్ను ఆ గెడ్డపోడు..రేవులో తాడిగాడు పచ్చి బూతులు తిడుతుంటే కడుపులో దేవేస్తుంది..!

తిని ఇముడ్చుకోలేక నిన్ను వదులు కున్నందుకు మాకు శిక్ష పడిపోయింది..!

కొందరేమో మోళీ చేసేసేడు మోదీ అంటున్నారు..!అలాంటప్పుడు ఎదురు తిరక్కుండా ..ఇతనేమైనా ఎగస్ట్రా ఇచ్చేస్తాడేమో అని చూసాము చూడు! ఆపాపం మమ్మల్ని వెంటాడేస్తుందయ్యా!

ఈ లోపు కరోనా వచ్చేసింది..మా పాట్లు..చెప్పనలవి కాదు..!

రోడ్డు మీదకొస్తే పోలీసోళ్ళు ముడ్డి పగలకొట్టేసేవారు..!

మందు షాపులు వదిలి పెట్టిన్నాటి నుండి కొంచెం కొడతం మానేసేరు..!

ఆళ్ళూ ఈళ్ళూ అనిలేదు..పెద్దాళ్ళనుండి రోజు పని చేసుకునే వారి వరకు అందరికీ దూల తీరిపోయింది..కొందరు లోలోపల ఏడుస్తున్నారు..జగన్ రావాలి కావాలి అన్నవాళ్ళు..!

అయ్యా మాది తప్పే! తినే కూట్లో మన్ను పోసుకున్నాము..!

మాకు శిక్షాకాలం ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నాము..!

నాలుగున్నరేళ్ళు అయింది..ఇంకా ఆరునెలలు గడపాలని తలుచుకుంటే ఒణుకు పుడుతుంది.

అందరూ మీరు ఓడిపోయారనుకుంటున్నారు..!

కాదు మేము ఓడిపోయాము.

పనివాడ్ని వదిలి పనికిమాలిన వాడ్ని తెచ్చుకున్నందుకు పశ్చాత్తాపం..!

ఎగబడి వస్తున్నాం మీ సభలకు..!

లోకేష్ పాదయాత్రకు స్పందిస్తున్నాము.

అందరూ అతన్ని చూసి భయపడతారు కాని..!

నిజానికి అతనే భయపడ్డాడు.

అందుకే పైనున్నవాడు..పక్కనోడు కలిసి మిమ్మల్ని అక్రమంగా నిర్భందించారు.

మిమ్మల్ని లోపలెట్టి లొంగదీయాలనుకున్నారు.

మీరు లొంగరని తెలుసు..!

వాళ్ళని ఓడించే వరకు నిద్రపోము..!

కడుపులో నీళ్ళు కదలకుండా హాయిగా పనిపాటలతో ఉండేవాళ్ళం.. మా వాళ్ళు కొందరు చేసిన తప్పుకి అందరం శిక్ష అనుభవిస్తున్నాము.

ఇవాళ మీరు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు..!

మా ఓపిక అయిపోయింది.

నీ పట్టుదల..నిజాయితీ మాకు వెయ్యేనుగుల బలం ఇస్తుంది.

నీ శత్రుకూటమిని ఎన్నికల్లో ఓడించి తీరుతాము.

ఓటే మా ఆయుధం..!

వాళ్ళ ఓటమే ఆశయం..!

అయ్యా వెయ్యి దేముళ్ళకు మొక్కేస్తున్నాము..మళ్ళీ నువ్వేరావాలని..!

ఇప్పటికి ఇంతే సంగతులు…

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

పేదప్రజలకు మెరుగైనవైద్యం అందచేయాలనే సంకల్పముతోజగనన్నఆరోగ్యసురక్ష

కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై నవంబర్ 8న విద్యా సంస్థల బంద్.