in ,

ఆరోగ్య సురక్ష సద్వినియోగం చేసుకోవాలి

 కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం నందిగంపాడు మరియు తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో హోం మంత్రి వనిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వనిత గారు మాట్లాడుతూ తండ్రి రెండు అడుగులు వేస్తే తనయుడు నాలుగు అడుగులు వేసి ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అని అన్నారు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వాలంటీర్లు, వైద్య సిబ్బంది సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రతి పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలబడుతూ పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు.

ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన వైద్య సిబ్బంది, ఇతర అధికారులకు అభినందనలు తెలిపారు.

 ఈ కార్యక్రమానికి కొవ్వూరు నియోజవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

ఏపీలో ఐటీ సంస్థలు రావాలి.కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా

గడప వద్దకే సంక్షేమ పథకాలు