in ,

అల్లూరి జిల్లాలో 3,353 మంది వాహన మిత్రాలకు రూ.3.35 కోట్ల సాయం

వైయస్సార్ వాహన మిత్ర ఐదో ఏడాది సాయంగా అల్లూరి జిల్లాకు సంబంధించి 3,353 మందికి రూ.3.35 కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం శుక్రవారం అందజేసింది. కలెక్టరేట్ లో ఆటో , టాక్సీ, క్యాబ్,  మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ఐదో ఏడాది సాయాన్ని పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు లబ్ధిదారులకు అందజేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సమయంలో ఆటో, టాక్స్, క్యాబ్ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూశారని అందుకే రోజంతా కష్టపడుతున్నా సరే ఆదాయం రాని వారి జీవితాల్లో కొద్దిపాటి అయినా సాయం అందించాలని ఉద్దేశంతో వైయస్సార్ వాహన మిత్రను తీసుకురావడం జరిగిందన్నారు. జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. డ్రైవర్లు వారి వాహనాలు నిర్వహణ భారం, ఇన్సూరెన్స్ ప్రీమియం,  ఫిట్ నెస్ ఫీజులు మొదలైన ఖర్చులు వల్ల ఆర్థికంగా భారం పడుతుందన్న విషయం గమనించినటువంటి ముఖ్యమంత్రివర్యులు వారికి అండగా ఉండేందుకు ఏడాదికి రూ. 10వేల చొప్పున వైయస్సార్ వాహన మిత్రు ద్వారా

 డ్రైవర్లకు అందిస్తున్న విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్ల కాలంలో ఇప్పటికీ ఐదు విడతలుగా సాయం ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ ఐదు విడతల్లో ఒక్కొక్క డ్రైవర్ కు రూ.50 వేలు ప్రభుత్వం సాయం అందించిందని వెల్లడించారు. ఒక అల్లూరి జిల్లాలోని 3,353 మంది లబ్ధిదారులు ఉంటే పట్టణాలు నగరాలలో వీరి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో ఒకసారి ఆలోచించొచ్చు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,75 931 మంది లబ్ధిదారులు వైయస్సార్ వాహన మిత్ర సాయాన్ని పొందుతున్నారని ఐదో విడత రూ.275.93 కోట్ల సాయాన్ని అందజేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు పిడి మురళి ,  ఆర్డీవో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

పాఠశాల సీజ్ చేసిన…ఆగని విద్యా బోధన

కొత్తగా నిర్మించిన బ్రిడ్జి ఐదు నెలలకే ఇలా తయారైంది…