పాడేరు, అల్లూరి జిల్లా, సెప్టెంబరు 22 : గిరిజన సంస్కృతి, భాషలు, సాంప్రదాయాలు పరిరక్షించాలని జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు అనంత నాయక్ అన్నారు. శుక్రవారం పాడేరులో పర్యటించారు. ముందుగా మోద కొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఆలయ లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహిం తీర్ధ ప్రసాదాలను అందజేసారు. అనంతరం పి. పి. ఎం. ఆర్.సి.భవనానికి చేరుకున్నారు. అక్కడ నుండి స్థానిక శ్రీకృష్ణా పురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. కాఫీ, జిసిసి, వన్‌ధన్ వికాస కేంద్రం స్టాల్స్‌ను సందర్శించారు. జిల్లాలో కాఫీ సాగు, ఉత్పత్తి, గిరిజన రైతులు కాఫీ సాగులో పొందుతున్న ఆదాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాఫీ, సాగు, జిసిసి సేవలు ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మండలానికి చెందిన 113 వన్ వికాస కేంద్రాల వివరించారు. పాడేరు మందికి 160 ఎకరాల భూములకు పట్టాలు పంపిణీ చేసారు. ముందుగా 30 మందికి అటవీ హక్కుపత్రాలు పంపిణీ చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు భరోసా వ్యవసాయ పెట్టుబడులు గురించి అధికారులు వివరించారు.
పాఠశాల బాగుందా ఇంటి దగ్గర బాగుందా ?
అనంతరం 10 వతరగతి విద్యార్థులతో ముచ్చటించారు. ఇంటి దగ్గర బాగుందా, పాఠశాలలో బాగుందని విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీని అధికారులు వివరించారు. వ్యవసాయ పనుల్లో తలిదండ్రులకు సాయం చేస్తారా, చేస్తామని విద్యార్థులు ఒరియా భాషలో వివరించారు. జలియన్ వాలా బాగ్ సంఘటన గురించి ప్రశించారు. భారత స్వాతంత్ర పోరాటంలో 1000 గోండు గిరిజనులు ప్రాణాలను అర్పించారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింత్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఐటిడి ఏ పి ఓ వి. అభిషేక్, గిరిజన సంక్షేమశాఖ డిడి ఐ. కొండలరావు, ఐటిడి ఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వి. ఎస్. ప్రభాకరరావు, ఎం. వేంకటేశ్వరరావు, టిసి ఆర్ టి ఎం అధికారి జి. చినబాబు, ఎస్టీ కమిషన్ అధికారులు పి.కె. పరీడా, జయంత్ జె. సరోడే, రాధాకాంత త్రిపాఠి, ఆర్. ఎస్. మిశ్రా, కురసా ఉమా మహేశ్వరరావు, పాంగి రాజారావు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు లిల్లీ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక గురుకుల కళాశాల ప్రాంగణంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. గిరిజన విద్యార్థులతో కమిషన్ సభ్యులు అనంత నాయక్, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో థింసా డాన్స్ చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!