in , , ,

ఔషద గుణాలు నల్లేరు… రాజమండ్రి మార్కెట్లో…

విస్తృతమైన ఔషద గుణాలు కలిగిన  నల్లేరు కాడలను మార్కెట్లో ప్రజలకు అందుబాటులో తీసుకు వచ్చామని రాజమండ్రి నగరానికి చెందిన రాజు వెల్లడించారు. రాజు మీడియా తో మాట్లాడారు.. నల్లేరు కాడల ప్రయోజనలనాలను వివరించారు. నల్లేరు ఎముకలను రక్షిస్తుందని, విరిగిన ఎముకలను అతికిస్తుంది అని తెలుసుకున్న పరిశోధకులు వీటి పై ప్రయోగాలు నిర్వహించారు. వీటి ఫలితాలను చూసి పరిశోధకులు నివ్వెరపోయారు.. ఇందుకోసం జంతువుల పై 21 రోజులు పరిశోధనలు చేసి ఎముక అతుక్కోవడన్ని ఎక్స్ రే ద్వారా గమనించి ఆశ్చర్యపోయారు. నల్లేరు మొక్క రెండు తెలుగు రాష్ట్రాలలో విరివిగా పెరుగుతుంది. నల్లేరు మొక్క లో కాల్షియం, బీటాకెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, అస్బార్బిక్ ఆమ్లం, బీటా సిస్టో స్టరాల్, విటమిన్ సి, మాంగనీస్ పొటాషియం అధికంగా ఉంటాయి. దీనిని పచ్చడి పులుసు కూరగా వండుకొని తింటారు. దీనివలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  

విరిగిన ఎముకల అతికించడానికి నల్లేరు రసం అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు సరైన మోతాదులో నల్లేరు గుజ్జును తీసుకుంటే ఎముకల అతుక్కుంటాయి. నల్లేరు ను పొయ్యి కొమ్ము లో మగ్గించి వీటిని దంచి రసం తీయాలి. వీటి రసానికి సమాన మోతాదులో అవు నెయ్యి కలిపి నెయ్యి మాత్రమే మిగిలే వరకూ మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న లేని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ నెయ్యిని ఉదయం, రాత్రి ఒక ఒక గ్లాసు గోరువెచ్చని ఆవుపాల లో ఒక స్పూన్ నెయ్యి కలిపి తీసుకుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. నల్లేరు గుజ్జు ను ఎముకలు విరిగిన చోట రాసి దానిపైన దూది వేసి కట్టుకట్టాలి ఇలా చేస్తూ ఉంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. నల్లేరు గుజ్జు తీసి 10 ml నీటిలో కలిపి తాగాలి ఇలా నాలుగు రోజులు రెండు సార్లు తాగితే చాలు. ఒకవంతు నల్లేరు గుజ్జు కు మూడు రెట్లు బియ్యం కలిపి తగినన్ని నీరు పోసి రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి. దీనిని రొట్టె లా తయారు చేసుకుని తింటే కొండ నాలుక, కోరింత దగ్గు తగ్గుతుంది

నల్లేరును సంస్కృతంలో వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని పిలుస్తారు.ప్రాచీన గ్రంధం భవప్రకాశ’ లో విరిగిన ఎముకలు అతుక్కోవటానికి నల్లేరు బాగా సహాయపడుతుందని తెలిపారు.    నల్లేరు గురించి పట్నవాసులకు తెలియదు కానీ పల్లెటూరు వాసులకు బాగా తెలుసు.నల్లేరు పల్లెటూర్లలో పొలాల్లో,రోడ్డు పక్కన డొంకల్లో ఉంటుంది.

నల్లేరు తీగలాగా ఉంటుంది.సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.దీని కాండం చతురస్రాకారంలో ఉండి 8-10 సెంటీమీటర్ల దగ్గర ‘గణుపు’ వుంటుంది.  

ఆ గణుపు దగ్గర వేరు మరియు ఆకులు వస్తాయి.నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్, సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి. నల్లేరు ఎముకలలో దృఢత్వం పెంచటమే కాకుండా ప్రక్కన వుండే కండరాలకు శక్తిని కలిగిస్తుంది.ఇదికాక దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయి.  ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా నివారణ గుణాలు ఉంటాయి.  నల్లేరు రసంను సిద్ద వైద్యంలో వాడతారు.నల్లేరు లో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలముగా ఉన్నాయి.నల్లేరు రసం రక్తహీనత లేకుండా కాపాడుతుంది .నల్లేరు తీగ లోని లేత కణుపులు కోసి వాటి తొక్క తీసి పచ్చడి,పప్పు,కూర వంటివి చేసుకుంటారు.అయితే నల్లేరును కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు.  మహిళలలో 40 వయసు తర్వాత వచ్చే మెనోపాజ్ లక్షణాలలో ఎముకల బలహీనత చాలా ముఖ్యమైనది.నల్లేరు లో అధికముగా ఉండే కాల్షియం వలన అటువంటి ఇబ్బందులు తగ్గుతాయి .ఆస్థియో పోరోసిస్ ,ఎముకలు గుల్ల బారడం చిన్న దెబ్బలకు ఎముకలు విరగడం వంటివి రాకుండా నల్లేరు ఎంతగానో ఉపయోగపడుతుంది.నల్లేరులో పీచు అధికంగా ఉండటం వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది.  యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండుట వలన గ్యాస్ట్రిక్ అల్సర్ లను నిరోధిస్తుంది.ఆయుర్వేదం వైద్యంలో నల్లేరును ఎక్కువగా వాడతారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

చంద్రబాబు….మీరు పోలీస్ కస్టడీలో లేరు

గుండా సత్తయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన మంత్రి