in , ,

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ “

  • న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు సభలో ప్రతిపాదించింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్‌సభలో టేబుల్ చేశారు. దీనిపై వాడివేడిగా చర్చ సాగుతోంది. క్రెడిట్ వార్ నెలకొంది.
  •  కేంద్ర మంత్రులు అమిత్ షా, జితేంద్ర సింగ్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు సుప్రియా సులే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీత.. ఈ బిల్లుపై మాట్లాడారు. బిల్లును సమర్థిస్తోన్నామని చెప్పారు. 2010లోనే తమ ప్రభుత్వం ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకుందని గుర్తు చేశారు.
    రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనేది రాజీవ్ గాంధీ కల అని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకోవడానికి తమ ప్రభుత్వ హయాంలో చిత్తశుద్ధితో ప్రయత్నించామని గుర్తు చేశారు. దీనికోసం 13 సంవత్సరాలుగా ఎదురు చూస్తోన్నామని, ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు అమలును వాయిదా వేసిందని, అది సరికాదని చెప్పారు.
  •  మహిళా రిజర్వేషన్ బిల్లు మీద వంగా గీత మాట్లాడారు. ఏపీలో మహిళా సాధికారికత కొనసాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచీ మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.

    ఇళ్ల పట్టాలను పంపిణీ, వాటిని నిర్మించి ఇవ్వడం ద్వారా 32 లక్షల మందికి పైగా పేద మహిళలకు లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులను సమకూర్చి పెట్టిందని వంగా గీత చెప్పారు. లక్షలాది విలువైన ఇంటి స్థలం మహిళ పేరుపై ఇచ్చిన ఘనత తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనని పేర్కొన్నారు. మహిళలను లక్షాధికారులను చేశామని తాము గర్వంగా చెప్పుకోగలమని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

నిరుపేద కుటుంబానికి ఆపన్న హస్తం అందించిన – కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్

కొందరు రాజకీయాల్లో చౌకబారుగా నటిస్తున్నారు: వెంకయ్య- పాచిపోయిన లడ్డూపై రివెంజ్*