ధర్మారం. సెప్టెంబర్.20 గురు న్యూస్: పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కొమ్మ నర్సయ్య గత మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు చికిత్స నిమిత్తం కరీంనగర్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయగా వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన యాదవ సంఘం సభ్యులు కులుముల దామోదర్ యాదవ్ కు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడంతో తక్షణమే స్పందించి ఎన్నారై కెనడా నుండి కొలుమూల దామోదర్ యాదవ్ నర్సయ్యకు ఆర్థిక సాయం గా పదివేల రూపాయలను పంపించారు. ఈరోజు బుధవారం నాడు ఎర్రగుంటపల్లి యాదవ సంఘం సమక్షంలో కొలుముల ఫౌండేషన్ సభ్యుల చేతుల మీదుగా నర్సయ్య భార్య మల్లవ్వకు పదివేల రూపాయలను అందించారు. ఈ సందర్భంగా మల్లవ్వ మాట్లాడుతూ, అడగగానే సహాయం అందించి మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు కొలుమూల దామోదర్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి వేల్పుల నాగరాజు యాదవ్, ధర్మా మండల యాదవ సంఘం అధ్యక్షులు ఆవుల ఎల్లయ్య యాదవ్, గోర్లకపర్ల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు జంగ మహేందర్ యాదవ్, జెల్ల సంపత్ బొట్లనపతి సొసైటీ అధ్యక్షుడు, ఆవుల మహేష్ కటికనపల్లి సొసైటీ అధ్యక్షుడు, ఎర్రగుంటపల్లి యాదవ సంఘం అధ్యక్షులు వేముల సుభాష్, మండల యువజన నాయకులు అల్లం శ్రీశైలం, కోళ తిరుపతి, నర్సింహులపల్లి అధ్యక్షులు కొమ్మ మల్లేష్, పలగాని రాజుమల్లు, ధర్మారం మండలం జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
