విశాఖ ఉక్కు రక్షణకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర 6 జిల్లాలు, 1150 కిలోమీటర్ల బైక్ యాత్ర విశాఖలో మంగళవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన తమ తమ అజెండాలో స్టీల్ ప్లాంట్ రక్షణ అంశం చేర్చాలని లేదంటే ప్రజానీకం ఆయా పార్టీలను ఒడిస్తాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. బీజేపీ కూడా ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయం అని ప్రకటించాలని అలా కాదంటే ఆ పార్టీ నాయకులను విశాఖలో ప్రజానీకం తిరగనివ్వరిని విఎస్సార్ హెచ్చరించారు. హాజరైన వివిధ వామపక్షలు, కార్మిక సంఘాల నేతలు గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. చంద్రబాబు అరెస్ట్ పై విఎస్సార్ స్పందిస్తూ ఆయన అక్రమాలు చేస్తే వాటిపై విచారణ చేయడం తప్పు కాదని, ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం కచ్చితంగా రాజకీయ కక్షే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వి వి రమణమూర్తి ఉక్కు పోరాట కమిటీ నాయకులు జె అయోధ్యరాం, ఆదినారాయణ, వరసాల శ్రీనివాసరావు, వివిధ పార్టీల నాయకులు మరుపల్లి పైడిరాజు, కొండయ్య, దేవా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాధం తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]